రజనీకాంత్-మురుగదాస్ సినిమా టైటిల్ ఖరారు

Darbar Movie | రజనీకాంత్, నయనతార, మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కించనున్న చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. బుధవారం నుంచి ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ముంబైలో ప్రారంభంకానున్నాయి.

news18-telugu
Updated: April 9, 2019, 9:49 AM IST
రజనీకాంత్-మురుగదాస్ సినిమా టైటిల్ ఖరారు
రజనీకాంత్ లేటెస్ట్ మూవీ టైటిల్ (దర్బార్) ఖరారు
news18-telugu
Updated: April 9, 2019, 9:49 AM IST
‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌, నయనతార, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి ‘దర్బార్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీంతో పాటు ఆ సినిమా ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రేపు (బుధవారం) నుంచి ‘దర్బార్‌’ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్‌ ఏర్పాటు చేశారు. 30 రోజుల పాటు అక్కడ తొలి షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రజనీకాంత్‌కు జోడీగా నయనతార నటిస్తుండగా...మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. రజనీకాంత్‌కు కుమార్తెగా నటి నివేదా థామస్‌ను నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీత దర్శకత్వంవహిస్తుండగా.. .లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. 2020 పొంగల్(సంక్రాంతి)కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ తదుపరి సినిమా టైటిల్ ఆయన ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్విట్టర్‌లో ఇది ట్రెండింగ్ అవుతోంది.
First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626