హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Marburg: కరోనా కంటే భయంకరమైన వైరస్.. సోకిందంటే మరణమే.. ఆ దేశంలో వెలుగులోకి..

Marburg: కరోనా కంటే భయంకరమైన వైరస్.. సోకిందంటే మరణమే.. ఆ దేశంలో వెలుగులోకి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Virus: మార్బర్గ్ వైరస్ అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని గతంలోనే ప్రకటించారు. ఈ వైరస్‌కు సంబంధించి 1967లో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

  కరోనా ప్రపంచాన్ని గడగడలాడించిన తరువాత ఏ కొత్త వైరస్ పేరు విన్నా జనం హడలిపోతున్నారు. అంతకుముందు ఇలాంటి వాటిని పట్టించుకోకపోయినా.. ఇప్పుడు మాత్రం వాటి గురించి తెలుసుకుంటున్నారు. వాటి వల్ల మనకు ఏమైనా ప్రమాదం ఉందా ? అని ఇంటర్నెట్‌లో ఆరా తీస్తున్నారు. కరోనా తరువాత మళ్లీ అలాంటి వైరస్‌లు ఇప్పటివరకు రాలేదు. కరోనా(CoronaVirus) కొత్త వేరియంట్లు సైతం మానవాళిపై అంతగా ప్రభావం చూపకపోవడంతో.. మళ్లీ జనం సాధారణ జీవనం గడుపుతున్నారు. అయితే కరోనా భయం మరువకముందే మరో భయంకరమైన వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైనదిగా గుర్తించబడింది. ఈ వైరస్ పేరు మార్బర్గ్(Marburg).

  మార్బర్గ్ వైరస్ అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని గతంలోనే ప్రకటించారు. ఈ వైరస్‌కు సంబంధించి 1967లో అత్యధిక కేసులు నమోదయ్యాయి.ఎవరైనా ఈ వైరస్‌ బారిన పడితే వాళ్లు చనిపోయే అవకాశాలే ఎక్కువ. పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలో మార్బర్గ్‌కు సంబంధించిన రెండు అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ కొత్త వైరస్ గురించి అప్రమత్తమైంది. మార్బర్గ్ ఇన్ఫెక్షన్ ఎబోలా వైరస్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తుంది. WHO ప్రకారం 1967 నుండి దక్షిణ మరియు తూర్పు ఆఫ్రికాలో మార్బర్గ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చాలా సార్లు కనిపించింది.

  ఈ వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో, సోకిన వారి మరణాల రేటు 24 శాతం నుండి 88 శాతం వరకు ఉంటుంది. ఈ వైరస్ ఒక వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుందని.. ఇది చర్మం నుండి చర్మ స్పర్శ ద్వారా కూడా వ్యాపిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ ఎన్.కె. గంగూలీ అన్నారు. మార్బర్గ్ వైరస్ ఎబోలా వైరస్‌కు సంబంధించిందని తెలిపారు. ఈ వైరస్ యొక్క లక్షణాలు ఫ్లూని పోలి ఉంటాయని.. దాని గుర్తింపు కోసం నమూనాలను తీసుకుని సీక్వెన్సింగ్ చేస్తారని అన్నారు. దాని నుండి టిష్యూ కల్చర్ చేయడం ద్వారా వైరస్ కనుగొనబడుతుందని వెల్లడించారు. మార్బర్గ్ వైరస్ వంటి వైరస్‌లు వస్తూనే ఉన్నాయని.. కానీ కరోనా తర్వాత ప్రజలు అలాంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. వీటి ట్రేసింగ్ కూడా పెరిగిందని . ఇలాంటి వైరస్‌పై నిఘా అవసరమని ఎన్.కె. గంగూలీ వ్యాఖ్యానించారు.

  Viral Video : లైవ్ రిపోర్టింగ్ లో ఉండగా..బాలుడిని చెంపదెబ్బ కొట్టిన మహిళా జర్నలిస్ట్

  James Webb Telescope: ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఫొటో ఇదే.. అప్పట్లో విశ్వం ఎలా ఉందో చూడండి..!

  గతంలో మార్బర్గ్ వైరస్ కేసులు వెలుగు చూశాయని డాక్టర్ ఎం. వలీ అన్నారు. అయితే ఈ వైరస్ ఎబోలా లాగా వ్యాపిస్తుంది కాబట్టి కరోనా యుగంలో మళ్లీ యాక్టివ్‌గా ఉండటం మంచిది కాదని అన్నారు. దీనికి యాంటీవైరల్ మందు లేదా వ్యాక్సిన్ లేదని చెప్పారు. అయితే ఆఫ్రికా బయట దేశాలలో ఈ వైరస్ కేసులు ఎన్నడూ రాకపోవడం ఉపశమనం కలిగించే విషయమని.. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Trending, Virus

  ఉత్తమ కథలు