Viral video: తాబేలు షవర్ డాన్స్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియోను ఓ లుక్కేయండి..!

డాన్స్ చేస్తున్న తాబేలు

అక్వేరియం సిబ్బంది పంపుతో నీళ్లు కొట్టే సమయంలో ఓ తాబేలు డ్యాన్స్ చేస్తోంది. సిబ్బంది తాబేలు బోను వద్దకు వెళ్లేంత వరకు అది మామూలుగానే ఉంది. దానిపై నీళ్లు స్ప్రే చేయడం మొదలుపెట్టగానే అది డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది.

  • Share this:
అమెరికాలోని టెన్సెస్సీ అక్వేరియంలో ఒక తాబేలు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. టర్నిప్ అనే పేరున్న ఈ తాబేలుకు స్నానం చేయిస్తున్నప్పుడు.. అది ఆకట్టుకునేలా డ్యాన్స్ చేస్తోంది. మడగాస్కర్ రేడియేటెడ్ తాబేళ్ల జాతికి చెందిన టర్నిప్ వయసు 12 సంవత్సరాలు. అంతరించి పోతున్న ఈ జాతి తాబేళ్లను సంరక్షణ కేంద్రాల్లో ప్రత్యేకంగా పెంచుతున్నారు. వీటి సంరక్షణ పద్ధతులు ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా ఈ జాతి తాబేళ్లు వర్షం వచ్చినప్పుడు డ్యాన్స్ చేస్తాయి. మసాజ్‌ను ఎంజాయ్ చేస్తాయి. వీటికి షెల్ పై మసాజ్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే తరచూ షవర్ చేయించడం, బ్రష్ సాయంతో మసాజ్ చేయడం చేస్తుంటారట. అయితే టర్నిప్ మాత్రం స్నానం చేయించే సమయంలో మిగిలిన అన్ని తాబేళ్ల కంటే బాగా డ్యాన్స్ చేస్తుందని సంరక్షణ కేంద్రానికి చెందిన సిబ్బంది చెబుతున్నారు.



వీడియోలో ఏముంది?
అక్వేరియం సిబ్బంది టర్నిప్‌ కి క్రమం తప్పకుండా పంపుతో నీళ్లు కొడతారు. ఆ సమయంలో ఇది డ్యాన్స్ చేస్తోంది. సిబ్బంది తాబేలు బోను వద్దకు వెళ్లేంత వరకు అది మామూలుగానే ఉంది. దానిపై నీళ్లు స్ప్రే చేయడం మొదలుపెట్టగానే అది డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. నాలుగు కాళ్లను పూర్తిగా పైకెత్తి డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. నీళ్లు స్ప్రే చేయడం ఆపేయగానే డ్యాన్స్ కూడా ఆపేసింది. మళ్లీ మొదలు పెడితే డ్యాన్స్ చేసింది. చూసేందుకు చాలా క్యూట్ గా ఉండడంతో టెన్నెస్సీ అక్వేరియం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్విట్టర్‌లో దీన్ని నాలుగున్నర లక్షల మందికి పైగా చూడడం విశేషం. చాలామంది ఈ తాబేలు ఎంత క్యూట్ గా ఉంది.. అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది అంటూ కామెంట్లు చేయడంతో పాటు రీట్వీట్లు కూడా చేస్తున్నారు.
Published by:Hasaan Kandula
First published: