హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Dancing Car: డాన్స్ చేస్తున్న కారు.. వీడియో వైరల్.. ఓనర్ కు భారీ ఫైన్

Dancing Car: డాన్స్ చేస్తున్న కారు.. వీడియో వైరల్.. ఓనర్ కు భారీ ఫైన్

Image credits Youtube

Image credits Youtube

Dancing Car: వేగంగా వెళ్తున్న కార్లోని డ్రైవర్ బ్రేకులు వేస్తే ఏం జరుగుతుంది.. వెంటనే కారు ఆగిపోతుంది.. కానీ ఈ కారు మాత్రం డాన్స్ వేస్తోంది. దానికి తోడు కిర్రాకైన పాటలు, లైటింగ్ ఎఫెక్ట్స్ చూస్తే చిన్నసైజు రికార్డింగ్ డాన్సులా అనిపిస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

ఏంటీ.. హెడ్డింగ్ చూసి అవాక్కయ్యారా..? కారు డాన్స్ చేయడమేంటని డౌటొచ్చింది కదూ. అవును నిజమే, కారు డాన్స్ చేస్తోంది. వేగంగా వెళ్తున్న కార్లోని డ్రైవర్ బ్రేకులు వేస్తే ఏం జరుగుతుంది.. వెంటనే కారు ఆగిపోతుంది.. కానీ ఈ కారు మాత్రం డాన్స్ వేస్తోంది. దానికి తోడు కిర్రాకైన పాటలు, లైటింగ్ ఎఫెక్ట్స్ చూస్తే చిన్నసైజు రికార్డింగ్ డాన్సులా అనిపిస్తుంది. తనకు ఉన్న అవగాహనతో కారులో చిన్న చిన్న మార్పులు చేసి మామూలు మహీంద్రా స్కార్పియో (mahindra Scorpio) కారును డాన్సింగ్ కారు (dancing car) గా మార్చాడో ఢిల్లీ వ్యక్తి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

ఢిల్లీకి చెందిన నాజమ్ అహ్మద్ అనే వ్యక్తికి ఓ కారు ఉంది. కొత్త ఏడాది సందర్భంగా కొత్త ప్రయోగం చేద్దామనుకున్నాడో ఏమో కానీ, తన కారును సమూలంగా మార్చేశాడు. కారులో ఉండే షాకర్స్ ను తీసేసి పెద్దవి పెట్టాడు. అంతే బ్రేకులు వేసినప్పుడల్లా కారు జంప్ చేస్తూ డాన్స్ చేస్తున్నట్టుగా కనిపించేలా సెట్ చేశాడు. దానికితోడు రికార్డింగ్ డాన్స్ స్టేజీల వద్ద కనిపించే రంగురంగుల లైట్ సెట్టింగును కారుకు తగిలించాడు. పెద్ద పెద్ద స్పీకర్లను కూడా అమర్చాడు.

' isDesktop="true" id="709134" youtubeid="hdzCD-Cnqzw" category="trending">

గత ఆదివారం అదిరిపోయే మాస్ సాంగ్స్ పెట్టి, పెద్ద పెద్ద సౌండ్లతో అందరినీ అదిరిపోయేలా చేశాడు. ‘కారు డాన్స్ చేస్తోందిరా’ అని చాలా మంది ఆసక్తిగా చూశారు. ఇది కొందరికి న్యూసెన్స్ గా అనిపించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు రావడం, అతడి కారును స్వాధీనం చేసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. కారు యజమానికి రూ. 41,500 జరిమానా విధించారు. జరిమాన మాట ఎలా ఉన్నా.. ఈ డాన్సింగ్ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కారుకు డెకరేషన్ చేయడం నెటిపన్లను ఆకట్టుకుంటుంది.

First published:

Tags: CAR, Social Media, Trending, Trending videos, Viral, Viral Video, Youtube

ఉత్తమ కథలు