హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

స్టేజీ మీద షాకింగ్ ఘటన.. డ్యాన్ చూస్తూ కుప్పకూలిపోయిన ఆర్టిస్ట్.. వీడియో వైరల్..

స్టేజీ మీద షాకింగ్ ఘటన.. డ్యాన్ చూస్తూ కుప్పకూలిపోయిన ఆర్టిస్ట్.. వీడియో వైరల్..

డ్యాన్స్ చేస్తూ పడిపోయిన వ్యక్తి

డ్యాన్స్ చేస్తూ పడిపోయిన వ్యక్తి

Jammu: ఇద్దరు వ్యక్తులు స్టేజీ మీద శివ, పార్వతుల్లాగా వేషాలు వేసుకున్నారు. అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారు. వందలాదిగా జనాలు అక్కడికి వచ్చి వీరి ప్రదర్శన చూస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jammu and Kashmir, India

కొన్నిసార్లు డ్యాన్సర్ లు స్టేజీమీద ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. అగ్నిప్రమాదాలు జరగటం, డ్యాన్స్ చేస్తుండగానే స్టేజీ కుప్పకూలిపడిపోవడం, డ్యాన్స్ చేస్తుండగానే.. పాత్రలో లీనమై.. మరోకరిపై దాడి చేయడం వంటి అనేక ఘటనలు ఇది వరకే మనం చూశాం. అదే విధంగా.. కొన్ని సార్లు... డ్యాన్స్ లు చేస్తూ.. వ్యక్తులు స్టేజీమీద కుప్పకూలిపడిపోయిన ఘటనలు కూడా జరిగాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా మారింది.పూర్తి వివరాలు.. జమ్ములో (Jammu)  విషాదకర ఘటన జరిగింది. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని బిష్నా ప్రాంతంలో డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు శివ, పార్వతుల మాదిరిగా మేకప్ వేసుకున్నారు. అక్కడ.. 20 ఏళ్ల వ్యక్తి యోగేష్ గుప్తా, పార్వతి వేషధారణలో డ్యాన్స్ చేస్తున్నాడు. దీనికి చూడటానికి వందలాదిగా జనాలు వచ్చారు. అప్పుడు.. ప్రదర్శన ప్రారంభమైంది. ఈ క్రమంలో స్టేజీమీద పాటకు తగినట్లుగా పార్వతి వేషధారణలో ఉన్న వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంతలో అతను ఒక్కసారిగా స్టేజీమీద కుప్పకూలీపడిపోయాడు.అక్కడున్న వారంతా.. ప్రదర్శనలో భాగంగా పడిపోయాడని అనుకున్నారు. కానీ ఎంత సేపటికి లేవకపోతే శివుని మేకప్ వేసుకున్న వ్యక్తి అక్కడికి వెళ్లారు. అతడిని తట్టి లేపాడు. ఎంత సేపైన లేవకపోవడంతో వెంటనే షాక్ కు గురయ్యాడు. వెంటనే అక్కడున్న వారంతా అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిని చూసిన వైద్యులు హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా.. గతంలో కూడా యూపీలోని బరేలీలో ఇలాంటి ఘటన జరిగింది.
బర్త్ డే పార్టీలో డ్యాన్స్ చేస్తూ 48 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మృతుడు ప్రభాత్ కుమార్ బరేలీ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబ్ (ఐవీఆర్‌ఐ)లో అసిస్టెంట్ టెక్నికల్‌గా పనిచేస్తున్నాడు. ప్రభాత్‌కు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. ప్రేమ్‌నగర్‌లో జరిగిన స్నేహితుడి పుట్టినరోజు పార్టీలో తనకు ఇష్టమైన పాటలకు స్టేప్ లు వేస్తున్నప్పుడు ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ రెండు సంఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video)  మారాయి.

Published by:Paresh Inamdar
First published:

Tags: Classical dancer, Heart Attack, Jammu and Kashmir, Viral Video

ఉత్తమ కథలు