ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) డ్యాన్స్ ల వీడియోల ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే పెళ్లిలో వధువు, వరులు డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. అదే విధంగా అమ్మాయిలు, బారత్ లు, డీజే పాటలకు మాస్ స్టెప్పులు వేసిన వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక మరికొందరు తాము.. ఏమాత్రం తగ్గేదెలే అన్నట్లు తమ డ్యాన్స్ ల వీడియోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంటున్నారు.
తమ ట్యాలెంట్ ను అందరితో పంచుకుంటున్నారు. దీంతో వారు.. ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. ఒకప్పుడు డ్యాన్స్ (dance video) చేయడానికి అమ్మాయిలు ముందుకు వచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు, తమ మాస్ పర్పామెన్స్ ను, ఫోన్ లలో రికార్డు చేసి, అందరి దగ్గరు తమ ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా (Viral video) మారింది.
పూర్తి వివరాలు.. ఫేమస్ కొరియోగ్రాఫర్ ఉషాజే, మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి హైబ్రీడ్ భరటనాట్యం చేశారు. ఇటు క్లాస్ డ్యాన్స్ తో పాటు, ఫ్రీస్టైల్ హిప్-హాప్ మిక్సింగ్ తో అదరగొట్టారు. ఈ వీడియోను ఉషాజే.. తన ఇన్ స్టా హ్యండిల్ పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు క్లాసికల్ డ్యాన్స్ లు ఎక్కువగా చేసేవారు. ప్రస్తుతం ఈ హైబ్రిడ్ డ్యాన్స్ రోటిన్ కు కాస్త భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఈ క్లాసికల్, మాస్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఇదిలా ఉండగా 80 ఏళ్ల బామ్మ జిమ్ చేస్తు అందరిని షాక్ కు గురిచేసింది.
మనలో చాలా మంది ఆరోగ్యంపై ఎక్కువగా కాన్సెన్ ట్రెషన్ చేస్తుంటారు. సరైన సమయంలో తినడంతో పాటు.. శరీరానికి మంచి ఆకారం కోసం జిమ్ కు వెళ్లి మరీ కసరత్తులు చేస్తుంటారు. మంచి హెల్దీ డైట్ కూడా ఫాలో అవుతారు. కొందరు అందంగా, నాజుకుగా కన్పించడం కోసం తమ కడుపును కూడా మాడ్చుకుంటారు. మరికొందరు పొద్దునే జాగింగ్, యోగాలు చేసేస్తుంటారు. ఈ మధ్య కాలంలో యువకుల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. దీని కోసం రకరకాల కసరత్తులు చేస్తున్నారు. కొందరైతే ఇంట్లోనే డంబెల్స్ తెచ్చుకొనిపెట్టుకుంటున్నారు. సమయం ఉన్నప్పుడల్లా వర్కవుట్స్ చేస్తుంటారు. అయితే, ఇక్కడోక బామ్మ తన మనవడితో కలిసి జిమ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. ఒక బామ్మ తన మనవడు జిమ్ చేస్తుండగా టెర్రస్ మీదకు వెళ్లింది. ఆమెకు 82 ఏళ్లు. తన మనవడు ఆమెకు సవాల్ విసిరాడో.. మరేంటో కానీ.. 80 కేజీల డంబెల్ ను ఎత్తింది. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా డంబెల్ ను పైకి ఎత్తి ఆ తర్వాత మెల్లగా కింద పెట్టింది. బామ్మ వర్కవుట్స్ చూసి మనవడు షాక్ కు గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్... బామ్మ.. భలే వర్కవుట్స్ చేస్తుందంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.