యాడ్స్‌కు అనుమతి ఇవ్వలేదని.. కోర్టుకెక్కిన సెక్స్ టాయ్స్ కంపెనీ..

Sex Toys Controversy | టాయ్స్‌ను తయారు చేసిన ఆ కంపెనీ.. దానిపై ప్రకటనలు తయారు చేసి న్యూయార్క్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఎమ్‌టీఏ) అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అయితే ఆ ప్రకటన అసభ్యకరంగా, ‘సెక్సియెస్ట్’గా ఉందన్న కారణంతో ఆ ప్రకటనకు అనుమతి ఇవ్వలేదు.

news18-telugu
Updated: June 19, 2019, 1:35 PM IST
యాడ్స్‌కు అనుమతి ఇవ్వలేదని.. కోర్టుకెక్కిన సెక్స్ టాయ్స్ కంపెనీ..
Sex Toys Controversy | టాయ్స్‌ను తయారు చేసిన ఆ కంపెనీ.. దానిపై ప్రకటనలు తయారు చేసి న్యూయార్క్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఎమ్‌టీఏ) అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అయితే ఆ ప్రకటన అసభ్యకరంగా, ‘సెక్సియెస్ట్’గా ఉందన్న కారణంతో ఆ ప్రకటనకు అనుమతి ఇవ్వలేదు.
  • Share this:
అదో సెక్స్ టాయ్స్ కంపెనీ. అంటే.. స్త్రీ, పురుషులకు లైంగిక ఆనందాన్ని కలిగించే పరికరాలు తయారు చేసే కంపెనీ. అయితే, తాను తయారు చేసిన కొన్ని ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఓ ప్రకటనను రూపొందించింది ఆ కంపెనీ. దానికి సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు ఎక్కి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకెళితే.. అమెరికాకు చెందిన డేమ్ కంపెనీ.. సెక్స్ టాయ్స్ తయారు చేస్తుంది. తాజాగా, కొన్ని కొత్త రకం టాయ్స్‌ను తయారు చేసిన ఆ కంపెనీ.. దానిపై ప్రకటనలు తయారు చేసి న్యూయార్క్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఎమ్‌టీఏ) అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అయితే ఆ ప్రకటన అసభ్యకరంగా, ‘సెక్సియెస్ట్’గా ఉందన్న కారణంతో ఆ ప్రకటనకు అనుమతి ఇవ్వలేదు. సెన్సార్‌షిప్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రకటన ఉందని తిరస్కరించింది. దీంతో తమ ప్రకటనకు అనుమతి ఇచ్చేలా సదరు అధికారులను ఆదేశించాలని కోర్టు మెట్లు ఎక్కింది.

ఎమ్‌టీఏ సెక్స్ టాయ్స్

దానికోసం 40 పేజీల పిటిషన్‌ను కోర్టు ముందు ఉంచింది. తొలుత ప్రకటనకు అనుమతి ఇచ్చి, ఆ తర్వాత అనుమతి నిరాకరించిందని, ఎమ్‌టీఏ రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తోందని ఆరోపించింది. అంతేకాదు, అధికారులు తమ వ్యాపారాన్ని సరిగా చేసుకోనివ్వడం లేదంటూ.. #DerailSexism ట్యాగ్‌లైన్‌తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading