Baby Beer Bong: పాపతో ఎక్కువ పాలు తాగించేందుకు ఓ తండ్రి కొత్త టెక్నిక్.. వైరల్ అవుతున్న వీడియో

(Image-Instagram)

పిల్లల పెంపకంలో ఎదురయ్యే సవాళ్లను ఈ తరం తల్లిదండ్రులు స్మార్ట్‌గా పరిష్కరించుకుంటున్నారు. తక్కువ బరువుతో పుట్టిన తన కూతురు బరువు పెరగడానికి వినూత్నమైన ఏర్పాట్లు చేసి వార్తల్లో నిలిచాడు ఒక వ్యక్తి. 

  • Share this:
పిల్లల పెంపకంలో ఎదురయ్యే సవాళ్లను ఈ తరం తల్లిదండ్రులు స్మార్ట్‌గా పరిష్కరించుకుంటున్నారు. తక్కువ బరువుతో పుట్టిన తన కూతురు బరువు పెరగడానికి వినూత్నమైన ఏర్పాట్లు చేసి వార్తల్లో నిలిచాడు ఒక వ్యక్తి.  సియాటెల్‌కు చెందిన రూడీ విల్లింగ్ హామ్ అనే వ్యక్తికి ఎనిమిది నెలల వయసున్న ఒక పాప ఉంది. లిల్లీ అనే ఆ చిన్నారి తక్కువ బరువుతో పుట్టింది. దీంతో బరువు పెరగడానికి పాపకు ఎక్కువ క్యాలరీలు అందివ్వాలని డాక్టర్లు చెప్పారు. దీంతో పాపకు ఎక్కువ మొత్తంలో ఫార్ములా మిల్క్ తాగించేందుకు రూడీ ఒక సృజనాత్మక మార్గాన్ని కనుగొన్నాడు. ఒక బీర్‌ బాంగ్ (నిర్ణీత మొత్తంలో బీరు తాగేందుకు వాడే పరికరం)కు కొన్ని మార్పులు చేసి బేబీ బీర్ బాంగ్‌ను తయారు చేశాడు. ఈ వీడియోలు బయటకు రావడంతో అతడి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది.

తన కూతురు బరువు పెరగడానికి ఈ ప్రయోగం చేశానని రూడీ చెబుతున్నాడు. సాధారణంగా తక్కువ బరువు ఉండే పాఠశాల విద్యార్థులు బరువు పెరగడానికి బేబీ బీర్ బాంగ్‌లను సిఫారసు చేస్తారు. దీని ద్వారా వారికి అవసరమయ్యే పదార్థాలను కొలత ప్రకారం అందించవచ్చు. ఈ పరికరం తన కూతురికి కూడా ఉపయోగపడుతుందని రూడీ విల్లింగ్ భావించాడు. కొన్ని రోజులుగా అతడు పొడవైన బేబీ బీర్ బాంగ్ సాయంతో తన కూతురికి పాలు పట్టిస్తున్నాడు. అప్పుడు తీసిన వీడియోను రూడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది వైరల్‌గా మారింది.



* సొంతంగా తయారీ.. "కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఈ సూత్రం పనిచేసింది. ఇప్పుడు నా కూతురికి కూడా పని చేస్తుంది కదా?" అని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. రూడీ ఈ పరికరాన్ని సొంతంగా తయారు చేశాడు. బయట లభించే బీర్‌బాంగ్‌ను సేకరించాడు. దానికి పాల డబ్బాకు ఉండే పాలపీకను పెట్టాడు. అది సులభంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీన్ని తన కూతురికి ఫార్ములా మిల్క్ అందించేందుకు మాత్రమే వాడుతున్నానని రూడీ చెప్పాడు. వాడిన తరువాత దాన్ని కడిగి పరిశుభ్రంగా భద్రపరుస్తున్నానని తెలిపాడు. అతడి ఐడియాను పాప తల్లి కూడా మెచ్చుకుంది.

* వైరల్ అవుతున్న వీడియో.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రూడీ వీడియోను కొన్ని లక్షల మంది చూశారు. అతడి స్నేహితులు కూడా కొత్త రకం బీర్ బాంగ్ తయారు చేసివ్వమని అతడిని అడుగుతున్నారు. పాప కోసం కనిపెట్టిన ఈ కొత్త పరికరం తండ్రి ప్రేమకు నిదర్శనమని ఒక వ్యక్తి వీడియోకు కామెంట్ పెట్టాడు. బేబీ బార్ బాంగ్‌తో తండ్రీ కూతుళ్ల పని సులువైందని మరో వ్యక్తి కామెంట్ రాశాడు. ఈ పరికరాన్ని చూసి పెద్దయిన తరువాత పాప ఆశ్చర్యపోతుందని ఇంకొక వ్యక్తి కామెంట్ చేశాడు.
Published by:Sumanth Kanukula
First published: