Cyclone Vayu: గుజరాత్‌ను బెంబేలెత్తిస్తున్న వాయు తుఫాన్.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్..

Cyclone Vayu: 13వ తేదీ ఉదయానికి గుజరాత్‌లోని పోరుబందర్‌-మహువా మధ్యలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 12, 2019, 2:33 PM IST
Cyclone Vayu: గుజరాత్‌ను బెంబేలెత్తిస్తున్న వాయు తుఫాన్.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
‘వాయు’ తుఫాను గుజరాత్‌ను బెంబేలెత్తిస్తోంది. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. బనస్‌కాంత, సబర్‌కాంత జిల్లాల్లో తుఫాను వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, డామన్‌ అండ్‌ డయ్యూల్లోనూ వర్షాలు పడుతున్నాయి. 13వ తేదీ ఉదయానికి గుజరాత్‌లోని పోరుబందర్‌-మహువా మధ్యలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న అన్ని రైళ్లను ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం వరకు నిలిపివేయనున్నారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.ముందు జాగ్రత్తగా చర్యగా అధికారులు జూన్‌ 13న పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ మూడు రోజుల పాటు పర్యాటకులు ఎవరూ గుజరాత్‌ రావద్దని.. ప్రస్తుతం ఉన్న వారు పర్యటనకు వెళ్లవద్దని కోరారు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading