వానలకు అడ్డుపడ్డ గాలి.. తొలకరి జల్లులకు తప్పని ఎదురుచూపులు

Rains: గుజరాత్ వైపు దూసుకొస్తున్న సైక్లోన్ దెబ్బకు నైరుతి రుతుపవనాలు కేరళలోనే ఆగిపోవడంతో తొలకరి కోసం మరిన్ని రోజులు వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 12, 2019, 7:14 AM IST
వానలకు అడ్డుపడ్డ గాలి.. తొలకరి జల్లులకు తప్పని ఎదురుచూపులు
భారీ వర్షాలు (ఫైల్ ఫోటో )
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 12, 2019, 7:14 AM IST
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం.. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుదామనుకున్నాం.. చిరు జల్లుల్లో సేద తీరుదామనుకున్నాం.. పుడమి తల్లిని పావనం చేద్దామనుకున్నాం.. అన్నదాత మోములో చిరునవ్వును చూద్దామనుకున్నాం.. కానీ, ఇంకా నిరీక్షణకు తెరపడేలా లేదు. ఇప్పుడే వానలు కురిసేలా లేవు. గుజరాత్ వైపు దూసుకొస్తున్న సైక్లోన్ దెబ్బకు నైరుతి రుతుపవనాలు కేరళలోనే ఆగిపోవడంతో తొలకరి కోసం మరిన్ని రోజులు వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నెల తొలివారంలో కురవాల్సిన వానలు ఇప్పటి దాకా కురవలేదు. దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాల్సిన నైరుతి రుతుపవనాలను వాయు తుఫాను అడ్డుకుంటోందని భారత వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం రుతుపవన తేమ గాలులు, భూ ఊపరితలం మీద ఉన్న గాలులు మొత్తం అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌ దిశగా పయనిస్తున్నాయి.

అయితే, కారు మబ్బులను తుఫాన్‌ తనవైపు లాగేసుకుంటోందని నిపుణుడు ఒకరు తెలిపారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, విదర్భ, ఛత్తీ్‌స్‌గఢ్‌, ఒడిశా రాష్ర్టాలతో పాటు ఉత్తర భారతంలో వేడిగాలులు వీస్తున్నాయి. ఆ తుఫాన్‌ తీరం దాటిన తరువాత గానీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడున్న అంచనా ప్రకారం ఈ నెల 15, 16 తేదీల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...