ఒడిశాలో భారీ వర్షాలు... దూసుకొస్తున్న తుఫాన్ దృశ్యాలు ...

అంఫన్ తుఫానుతో ఒడిశా అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి.

news18-telugu
Updated: May 20, 2020, 2:48 PM IST
ఒడిశాలో భారీ వర్షాలు... దూసుకొస్తున్న తుఫాన్ దృశ్యాలు ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అంఫన్ తుఫానుతో ఒడిశా అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫన్ తుఫాను... మధ్యాహ్నం బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అది ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. అటు బెంగాల్‌ కూడా వాతావరణం మారింది. అక్కడ కూడా వర్షాలు మొదలయ్యాయి. ఆ రెండు రాష్ట్రాల్లో 3 లక్షల మందిని తీర ప్రాంత జిల్లాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం తుఫాను బెంగాల్ వైపుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈదురు గాలులు గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.
ఒడిశాలోని చాందీపూర్‌ను కుదిపేస్తున్న భారీ వర్షం, ఈదురుగాలులు .. బెంగాల్‌లోని ధిగాలో ఈదురుగాలులకు అల్లకల్లోలంగా మారిన సముద్రం...
Published by: Venu Gopal
First published: May 20, 2020, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading