Home /News /trending /

CYBERABAD TRAFFIC POLICE RELEASED A VIDEO RELATED TO A CAR AND AUTO ACCIDENT HELD NEAR INORBIT MALL ON SUNDAY NIGHT NK

Accident: ప్రయాణికుడి ప్రాణం తీసిన అతివేగం... వీడియో రిలీజ్ చేసిన సైబరాబాద్ పోలీసులు

ప్రయాణికుడి ప్రాణం తీసిన అతివేగం (image credit - twitter)

ప్రయాణికుడి ప్రాణం తీసిన అతివేగం (image credit - twitter)

Road Accident: కొంత మందికి కారు దొరికితే చాలు... రోడ్డు ఖాళీగా ఉందని ఊహించుకుంటూ... తెగ స్పీడుగా వెళ్తారు. అలా వెళ్లిన ఓ వ్యక్తి చేసిన పనికి... ఎంతటి విషాదం జరిగిందో సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.

    Road Accident: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా... ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ కూడా పటిష్ట పరిచారు. ఇక సీసీటీవీ కెమెరాలకు లెక్కలేదు. ఎక్కడా ఎవరూ వాటి నుంచి తప్పించుకునే ఛాన్స్ లేనంతగా వాటిని సిటీ అంతటా అమర్చారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... వాహనాలను నెమ్మదిగా నడపాలనీ, వేగంపై కంట్రోల్ ఉండాలనే కామన్ సెన్స్ వాటిని నడిపేవాళ్లకు ఉండాలి. సిటిలో 99 శాతం మంది వాహనాలను బాగానే నడుపుతున్నారు. ఆ ఒక్కశాతం మందే నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ... ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

    ఈ రోడ్డు ప్రమాదంలో అదివారం రాత్రి వాన సమయంలో... ఇనార్బిట్ మాల్ (Inorbit Mall) దగ్గర తడి రోడ్డుపై ఓ ఆటో నెమ్మదిగా వెళ్తోంది. ఆ ఆటో వెనక అత్యంత వేగంగా ఓ ఆడి కారు దూసుకొచ్చింది. అది ఆటోను సైడ్ నుంచి ఢీకొట్టడంతో... ఆటో గిరగిరా గిరగిరా తిరుగుతూ... 70 అడుగుల దూరం సర్రున వెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రిజ్మ్ పబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగి (ప్రయాణికుడు) చనిపోయాడని పోలీసులు తెలిపారు.

    ఇది కూడా చదవండి: Shocking: నేనే సృష్టికర్తని.. టీవీ లైవ్‌లోకి వచ్చిన అపరిచితుడు.. బిత్తరపోయిన పోలీసులు

    ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రమాదానికి కారణం... మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్లే అని తేల్చారు. వ్యక్తి మరణించినప్పటికీ... కావాలని హత్య చేయలేదు కాబట్టి... అపరాధ హత్యా నేరం (culpable homicide) కింద కేసు బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోలో 3 సీసీకెమెరాల్లో ప్రమాద దృశ్యాలున్నాయి. ఇక్కడ చూడండి.





    స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటారు కదా... అది నిజమే. ఎవరో చేసే తప్పులకు ఇంకెవరో బలైపోతూ ఉంటారు. ఆ చనిపోయిన వ్యక్తిపై ఎంత మంది ఆధారపడి ఉన్నారో... వారికి దిక్కెవరు... వారిని ఇకపై ఆర్థికంగా ఆదుకునేది ఎవరు... రోడ్డు ప్రమాదాల వల్ల ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారనీ... ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Hyderabad news, Road accident, Telangana, VIRAL NEWS, Viral vide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు