Alert: మీ ఇంట్లో దొంగతనం జరగొద్దంటే ఈ సలహాలు పాటించండి

పరిచయస్తుల ద్వారానే పనిమనుషుల్ని చేర్చుకోవడం మంచిది. గతంలో ఎక్కడ పనిచేశారో తెలుసుకోవాలి. అవసరమైతే ఆ ఇంటి యజమానులతో మాట్లాడాలి. అన్ని విధాల నమ్మకం కుదిరితేనే పనిలో చేర్చుకోవాలి.

news18-telugu
Updated: August 8, 2019, 6:10 PM IST
Alert: మీ ఇంట్లో దొంగతనం జరగొద్దంటే ఈ సలహాలు పాటించండి
Alert: మీ ఇంట్లో దొంగతనం జరగొద్దంటే ఈ సలహాలు పాటించండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పనిమనుషుల్లోనూ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. హైదరాబాద్ మహానగరానికి నిత్యం వేలాది మంది బతుకుదెరువు కోసం వస్తుంటారు. ఇళ్లల్లో, షాపుల్లో పనిచేస్తుంటారు. ఉపాధి పొందుతుంటారు. వారిలో కొందరు మాత్రం చోరీలు చేయడానికే సిటీకి వస్తున్నారు. పగలంతా ఖరీదైన కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తారు. ఏ ఇంట్లో చోరీ చేయాలో సెలెక్ట్ చేసుకుంటారు. ఏదైనా పని ఉంటే ఇప్పించమని ఇంటి యజమానులతో మాటలు కలుపుతారు. ఆ ఇంట్లో పనిమనుషులుగా చేరి పక్కా ప్లాన్‌తో చోరీలు చేస్తుంటారు. భార్యాభర్తలు ఉద్యోగాలు చేసే ఇళ్లు, వృద్ధులు, వ్యాపారస్తులు ఉండే ఇళ్లే వీరి టార్గెట్. పనిమనుషులుగా నమ్మించి టైమ్ చూసి ఇంట్లో సొత్తంతా దోచేస్తుంటారు. ఇలాంటివారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని.

పనిమనుషుల ముసుగులో వచ్చే దొంగల్ని గుర్తించడానికి సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఇళ్లల్లో దొంగతనం చేయడమే లక్ష్యంగా ఇలాంటివారు వస్తుంటారు. వచ్చీరాగానే చోరీ చేయకుండా ఇళ్లల్లో పరిస్థితుల్ని గమనిస్తారు. ఇంట్లో బంగారం, డబ్బు ఎక్కడ దాస్తారో తెలుసుకుంటారు.పెళ్లిళ్లు, శుభకార్యాలకు వేసుకునే నగలు ఎక్కడ ఉంటాయో గమనిస్తారు. వ్యాపారులైతే పెద్ద మొత్తంలో డబ్బు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయో చూస్తారు. మీ ఇంట్లో ఎవర్ని పనిమనుషులుగా చేర్చుకున్నా వారి వివరాలు Hawk eye యాప్‌లో రిజిస్టర్ చేయాలి. వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఉద్యోగం ఇవ్వాలి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్ లాంటి డాక్యుమెంట్స్ చూడాలి. పరిచయస్తుల ద్వారానే పనిమనుషుల్ని చేర్చుకోవడం మంచిది. గతంలో ఎక్కడ పనిచేశారో తెలుసుకోవాలి. అవసరమైతే ఆ ఇంటి యజమానులతో మాట్లాడాలి. అన్ని విధాల నమ్మకం కుదిరితేనే పనిలో చేర్చుకోవాలి.

ఇక పనిమనుషుల ముందే ఇంట్లోని విషయాలన్నీ చర్చించకూడదు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయం అస్సలు చర్చించొద్దు. పనిమనుషులకు మితిమీరిన స్వేచ్ఛ కూడా ఇవ్వొద్దు. వారితో పనిచేయించుకోవడం వరకే పరిమితం కావాలి. పనిమనుషులపై అనుమానం వస్తే వారి ప్రవర్తన, ఇతర వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచాలి. ఇంటి తాళం చెవులు పనిమనుషుల చేతికి ఇవ్వొద్దు. తాళం చెవులు డూప్లికేట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. బీరువా, లాకర్లు, ఇతర తాళం చెవుల్ని మీరు బయటకు వెళ్లేప్పుడు తీసుకెళ్లాలి. విలువైన వస్తువులు వారి కంటికి కనిపించనివ్వొద్దు. పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఉంటే బ్యాంకులో దాచుకోవడం ఉత్తమం.

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు
ఇవి కూడా చదవండి:

Business: టమాటా సాస్ వ్యాపారం... నెలకు రూ.40,000 ఆదాయంFlipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కొడైకెనాల్ టూర్... ప్యాకేజీ వివరాలివే
First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు