హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

నాసా అద్భుత ఫోటో అని ఇలాంటిది మీక్కూడా వచ్చిందా?.. ఓపెన్ చేశారా?.. ఇక నుంచి ఓపెన్ చేయద్దు.. ఎందుకంటే

నాసా అద్భుత ఫోటో అని ఇలాంటిది మీక్కూడా వచ్చిందా?.. ఓపెన్ చేశారా?.. ఇక నుంచి ఓపెన్ చేయద్దు.. ఎందుకంటే

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి తీసిన మొదటి ఫొటో ఇదే

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి తీసిన మొదటి ఫొటో ఇదే

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో జనాలను ముంచడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన నక్షత్రమండలానికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తున్నారు. మీకు కూడా అలాంటిది వచ్చిందా? ఓపెన్ చేశారా? అంతే సంగతులు. దాని ద్వారా మాల్వేర్‌ను మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి చొప్పిస్తారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Andhra Pradesh | Telangana | Karnataka | Maharashtra

డిజిటల్‌ ప్రపంచంలో దాదాపు అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చింది. అన్ని రకాల సేవలు ఫోన్‌లలో దొరుకుతున్నాయి. గతంలో రోజులు కేటాయిస్తేగానీ పూర్తవని పనులు ప్రస్తుతం క్షణాల్లో అయిపోతున్నాయి. ఇది ఇలా ఉంటే.. మరో పక్క సైబర్‌ నేరాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది సైబర్‌ మోసాల బారిన పడి విలువైన డబ్బును కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్‌ అటాక్‌(Cyber Attacks)ల నుంచి రక్షణ పొందడంపై, మోసపూరిత ట్రాన్సాక్షన్‌లను గుర్తించడంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫస్ట్‌ డీప్‌ ఫీల్డ్‌(First Deep Field) ఇమేజెస్‌తో దాడులు

హ్యాకర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలలో నేరాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మరో కొత్త మాల్వేర్‌(Malware) ద్వారా దాడులకు దిగుతున్నారు. ఇతర సిస్టమ్‌లోకి ప్రవేశించి, డబ్బును దోచుకోవడానికి, వినియోగదారుల డేటాను దొంగిలించడానికి మాల్వేర్‌ను ఉపయోగించేందుకు కొత్త పద్ధతిని రూపొందించారు. కంప్యూటర్‌లోకి చొరబడేందుకు NASA జేమ్స్ వెబ్ టెలిస్కోప్(James Webb Telescope) ద్వారా తీసిన అత్యంత ప్రజాదరణ పొందిన డీప్ స్పేస్ ఇమేజ్‌ను హ్యాకర్లు ఉపయోగించుకుని మాల్వేర్‌ దాడులకు దిగుతున్నట్లు తెలిసింది. ఈ తరహా దాడులు జరుగుతున్నట్లు సెక్యురోనిక్స్‌ థ్రెట్‌ రీసెర్చ్‌ టీం గుర్తించింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ ఇమేజెస్‌ను ఉపయోగించి హ్యాకింగ్‌కు పాల్పడుతున్న వివరాలను వెల్లడించింది. అంతరిక్షానికి సంబంధించి అత్యంత హై-డెఫినిషన్ ఇమేజెస్‌ను తీసిన టెలిస్కోప్‌గా వెబ్‌ టెలిస్కోప్‌ నిలిచింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది NASA వినియోగిస్తున్న స్పేస్‌ టెలిస్కోప్‌. 2021 డిసెంబర్‌లో దీనిని లాంచ్‌ చేశారు. దీనికి ‘ఫస్ట్ డీప్ ఫీల్డ్’ అని పేరు పెట్టారు.

OMG : అందరూ హైఅలర్ట్..విమానం కూల్చివేస్తానని పైలట్ బెదిరింపు!ఫిషింగ్‌ ఈమెయిల్‌తో అటాక్‌ మొదలు

ముస్తాంగ్ పాండా వంటి అధునాతన పెర్సిస్టెంట్ థ్రెట్(APT) గ్రూప్‌లలో గోలాంగ్-బేస్ట్‌ మాల్వేర్ బాగా ప్రాచుర్యం పొందింది. గో బైనరీస్‌ను అనలైజ్‌ లేదా రివర్స్‌ ఇంజినీరింగ్‌ చేయడం మరింత సవాలు. క్రాస్-ప్లాట్‌ఫారమ్ సపోర్ట్‌, కంపైలేషన్‌కు మాత్రమే గో అనువైనది.

మాల్వేర్ ఆథర్స్‌ Windows, *NIX ఆపరేటింగ్ సిస్టమ్‌ల వంటి మల్టిపుల్‌ ప్లాట్‌ఫారమ్‌ల కోసం బేసిక్‌ కోడ్‌బేస్‌ని ఉపయోగించి కోడ్‌ను కంపైల్ చేయగలరని సెక్యురోనిక్స్ పేర్కొంది.

Two Girls Marriage: బంగ్లా యువతిని పెళ్లి చేసుకున్న తమిళనాడు అమ్మాయి.. ఏంటో.. ఇంకా ఎన్ని సూడాలో..మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అటాచ్‌మెంట్‌ను కలిగి ఉన్న ఫిషింగ్ ఇమెయిల్‌తో ఇన్‌ఫెక్షన్ ప్రారంభమవుతుంది. అటాచ్‌మెంట్‌ను ఓపెన్‌ చేసిన వెంటనే దాడి ప్రారంభమవుతుంది.

ఇమేజ్‌ ఫైల్‌లా కనిపించే మాల్వేర్‌

చివరికి, వెబ్ టెలిస్కోప్ ద్వారా తీసిన ఇమేజ్‌ డెస్క్‌టాప్‌పై కనిపిస్తుంది. ఇది సాధారణ .jpg ఫైల్‌గా కనిపిస్తున్నప్పటికీ, టెక్స్ట్ ఎడిటర్‌తో తనిఖీ చేసినప్పుడు ఇది Base64-ఎన్‌కోడ్ చేసిన పేలోడ్‌గా మారుతుంది. రూపొందించబడిన ఫైల్ Windows 64-బిట్ ఎక్జిక్యూటబుల్, ఇది దాదాపు 1.7 MB వద్ద పెద్ద పరిమాణంలో ఉంటుంది.

ఎగ్జిక్యూట్ చేసిన మాల్వేర్ ప్రత్యేకమైన DNS కనెక్షన్‌లను క్రియేట్‌ చేస్తుందని, కమాండ్, కంట్రోల్ కోసం ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌ని వినియోగిస్తుందని, లేదా సున్నితమైన డేటాను దొంగిలించేందుకు ఉపయోగిస్తారని సెక్యురోనిక్స్‌ తెలిపింది. బైనరీ ఒరిజినల్‌ ఆథర్‌ పేలోడ్‌ను కొన్ని కౌంటర్-ఫోరెన్సిక్స్, యాంటీ-ఇడిఆర్ డిటెక్షన్ మెథడాలజీలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు స్పష్టంగా ఉందని పేర్కొంది.

Monkey : స్మార్ట్ ఫోన్ కు బానిసైన కోతి..ఫోన్ లేనిదే ఫుడ్ ముట్టట్లేదుఈ మాల్వేర్ నుంచి ఎలా రక్షణ పొందాలి?

తెలియని ఈమెయిల్స్‌, లేదా నాన్‌ ట్రస్టెట్‌ సోర్సెస్‌ నుంచి వచ్చిన ఈమెయిల్స్‌ను ఓపెన్‌ చేయకూడదని సెక్యురోనిక్స్‌ సూచించింది. అలాంటి హానికరమైన మెయిల్స్‌లో ఉన్న అటాచ్‌మెంట్స్‌ను డౌన్‌లోడ్‌ చేయకూడదని తెలిపింది.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: CYBER CRIME, NASA

ఉత్తమ కథలు