హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Cutest Dogs: ప్రపంచంలోనే అత్యంత అందమైన కుక్కల్లో దాన్ని కొట్టేదే లేదట..!

Cutest Dogs: ప్రపంచంలోనే అత్యంత అందమైన కుక్కల్లో దాన్ని కొట్టేదే లేదట..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెంపుడు జంతువులంటే మీకు ఇష్టమా? మీరు కుక్కలను పెంచుకుంటున్నారా? అయితే ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెంపుడు జంతువులు, కుక్క జాతి గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ప్రపంచంలోకెల్లా అత్యంత ఆకర్షణీయమైన, అందమైన కుక్కగా...

పెంపుడు జంతువులంటే మీకు ఇష్టమా? మీరు కుక్కలను పెంచుకుంటున్నారా? అయితే ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెంపుడు జంతువులు, కుక్క జాతి గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ప్రపంచంలోకెల్లా అత్యంత ఆకర్షణీయమైన, అందమైన కుక్కగా డాల్మేషన్‌ నిలిచింది. గోల్డెన్ రేషియో అనే ఒక పురాతన గ్రీకు అధ్యయనం ద్వారా అందమైన కుక్కల జాబితాను సిద్ధం చేశారు. పెంపుడు కుక్కలపై అధ్యయనం చేసే మనీ బీచ్ అనే అమెరికన్ సంస్థ ఈ పరిశోధన చేసింది. వివిధ రకాల పెంపుడు జంతువుల్లో అందమైన వాటిని కూడా ఆ సంస్థ గుర్తించింది. వాటి రూపం, శారీరక స్వభావం, అందం.. వంటివి పోల్చి ఈ జాబితాను సిద్ధం చేశారు. ఈ అధ్యయనం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వంద రకాల డాగ్ బ్రీడ్స్‌ను పోల్చడం విశేషం.

ఈ అధ్యయనాన్ని గోల్డెన్ రేషియో ఆధారంగా చేశారు. ఇది ఒక పురాతమైన గ్రీకు గణిత సూత్రం. దీని ప్రకారం ఏదైనా ప్రాణుల రూపం (సిమెట్రీ), కొలతలు (మెజర్మెంట్స్), నిష్పత్తులను (రేషియో) పోల్చి ఒక జాబితా తయారు చేస్తారు. చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అందమైన రూపం, ముఖంలో కళ ఉండే జంతువులను ఈ సూత్రం ద్వారా గుర్తించారు. మొత్తం వంద జాతుల కుక్కల ఫోటోలను అధ్యయనం కోసం పరిగణనలోకి తీసుకున్నారు. దీంట్లో 67 శాతం గోల్డెన్ రేషియోతో డాల్మేషన్‌ మొదటి స్థానంలో నిలిచింది. జాబితాలో దీని తరువాత ఐరిష్ వాటర్ స్పానియల్, వైర్ ఫాక్స్ టెరియర్.. వంటి కుక్కలు ఉన్నాయి.

World's Cutest Dogs, Cutest pets, Dalmatians, MoneyBeach research, Golden ratio, Top 10 cutest dog breeds, Irish Water Spaniel, Wire Fox Terrier, పెంపుడు జంతువులు, కుక్కలు, డాల్మేషన్, గోల్డెన్ రేషియో, మనీబీచ్
డాల్మేషన్ జాతి శునకం

* గోల్డెన్ రేషియో ప్రకారం.. టాప్ 10 అందమైన కుక్కల జాబితా

1. డాల్మేషన్ 2. ఐరిష్ వాటర్ స్పానియల్ 3. వైర్ ఫాక్స్ టెర్రియర్ 4. లాబ్రడార్ 5. బాసెట్ హౌండ్ 6. సమోయిడ్ 7. జాక్ రస్సెల్ 8. రాట్విలర్ 9. సెయింట్ బెర్నార్డ్ 10. గోల్డెన్ రిట్రీవర్

* మొదటి స్థానంలో పిల్లి

వ్యక్తులు లేదా ప్రాణుల కచ్చితమైన అందాన్ని కొలిచేందుకు గోల్డెన్ రేషియోను వినియోగిస్తున్నారు. కుక్కల కళ్ల మధ్య దూరం, వాటి చెవులు, ముక్కు, శారీరక కొలతల నిష్పత్తిని ఇతర జాతులతో పోల్చి ఆకర్షణీయత స్థాయులను గణించారు. మొత్తం 100 జాతుల్లో కేవలం పది మాత్రమే 62.5 శాతానికి మించి పాయింట్లు సాధించాయి. వీటిల్లో డాల్మేషన్ అత్యధికంగా 67.03 శాతం పాయింట్లను సొంతం చేసుకోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షణీయమైన పెంపుడు జంతువులను కూడా గోల్డెన్ రేషియో ప్రకారం గుర్తించారు. ఈ జాబితాలో పిల్లి మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఫెర్రెట్‌, మూడో స్థానంలో కుందేలు, నాలుగో స్థానంలో హ్యాంస్టర్‌ (ఒక ఎలుక జాతి).. తరువాత ఐదో స్థానంలో కుక్క నిలవడం విశేషం.

Published by:Sambasiva Reddy
First published:

Tags: Dog, Trending, VIRAL NEWS

ఉత్తమ కథలు