
Twitter image
టీ ష్టర్టు, ప్యాంట్ వేసుకున్న క్యూట్ పిల్లాడు.. కుక్క పిల్లల(Puppies)తో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral video)గా మారింది.
ఒక్కోసారి చిన్న వీడియోలు కూడా మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి. బాధల్లో ఉన్నా సంతోషం కలిగిస్తాయి. ఇక చిన్నపిల్లల అమాయకత్వం, నిష్కల్మషమైన చర్యలతో కూడిన వీడియోలైతే మంచి అనుభూతిని ఇస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ చిన్న పిల్లాడు.. నాలుగు పప్పీ(కుక్క పిల్లలు)లతో ఆడుకుంటున్న వీడియో నెటిజన్ల మనసులను దోచేస్తోంది.
ప్యాంటు, టీ షర్టు వేసుకొని ఎంతో క్యూట్ గా ఉన్న ఓ పిల్లాడు నాలుగు పప్పీలతో ఆడుకున్నాడు. అవి అతడి చుట్టే తిరుగుతూ సందడి చేశాయి. ఆ పిల్లాడికి గిలిగింతలు కూడా పెట్టాయి. నవ్వించాయి. మీదమీదకు వస్తూ ప్రేమను చాటాయి. వీటితో ఆడుకుంటున్నంత సేపు ఆ పిల్లాడు ఎంతో ఎంజాయ్ చేశాడు. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
So much bouncy fluff
ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో చూస్తున్న నెటిజన్లు షేర్లు, కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఎంతో క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Published by:Krishna P
First published:December 22, 2020, 15:10 IST