భోజనం చేసేందుకు రెస్టారెంట్‌కు వెళ్తే.. అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు.. ఎందుకో తెలుసా.?

ఖైదీ దుస్తుల్లో కస్టమర్లు

కస్టమర్లు బార్​లోకి వెళ్లే ముందే వారి అధికారిక వెబ్‌సైట్‌లో £ 35.99 (రూ .3,695) చెల్లించి ఎంట్రీ టికెట్ బుక్ చేసుకోవాలి. కస్టమర్లకు హాలీవుడ్ మూవీస్​, థియేట్రికల్ కాక్టెయిల్ బార్ ఎక్స్​పీరియన్స్​ అందిస్తామని వెబ్​సైట్​లో పేర్కొంది.

  • Share this:
సరదాగా భోజనం చేసేందుకు రెస్టారెంట్‌కు వెళ్లిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఖైదీ దుస్తులు వేసి జైల్లో వేస్తున్నారు. ఇంతకీ ఏంటా రెస్టారెంట్? ఎందుకిలా చేస్తున్నారు? అని అనుకుంటున్నారా? కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ రెస్టారెంట్ నిర్వాహకులు ఇలా సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. జైలు వాతావరణం ఉండేలా హోటల్‌ను మార్చేశారు. లండన్‌‌లో ఈ రెస్టారెంట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు తగ్గడంలో దాదాపు అన్ని దేశాలు కరోనా ఆంక్షలను సడలించాయి. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ మునపటిలా వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే ఇంతకాలం పాటు ప్రజలు వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు కొన్ని సంస్థలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా అనేక వాణిజ్య సముదాయాలు కస్టమర్లను అట్రాక్ట్​ చేసేందుకు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నాయి.

తాజాగా ఇంగ్లాండ్‌లోని ఒక రెస్టారెంట్​ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి వినూత్న పంథానే అనుసరించింది. కస్టమర్లకు జైలులో ఉన్న థ్రిల్లింగ్​ ఎక్స్​పీరియన్స్​ ఇస్తామని తెలిపింది. ఈ బార్​కి వచ్చే కస్టమర్లు ఖైదీల మాదిరిగా ఆరెంజ్ జంప్‌సూట్స్‌ దుస్తులు ధరించాలని కండీషన్​ పెట్టింది. లండన్​లోని ఆల్కోట్రాజ్ సెల్ బ్లాక్ టూ వన్ టూ అనే బార్.. కస్టమర్లకు ఇలాంటి వెరైటీ ఎక్స్​పీరియన్స్ అందిస్తోంది. ఈ జైల్ బార్‌లో కాక్టెయిల్స్ సిప్ చేసేటప్పుడు వార్డెన్లు కొంతమంది కస్టమర్లను తీసుకెళ్లి జైలులో బంధిస్తారు. అయితే మరికొంత మంది కస్టమర్లు వార్డెన్ల కళ్లుగప్పి జైలులో ఉన్న ఖైదీల చేతికి మద్యం బాటిళ్లను అక్రమంగా సరఫరా చేయాలి. ఇలా చేసిన కస్టమర్లను విజేతలుగా ప్రకటించి వారికి నచ్చిన కాక్టెయిల్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ గేమ్​లో పాల్గొనే కస్టమర్లు సృజనాత్మకంగా ఆలోచించాలని బార్​ యాజమాన్యం చెబుతోంది. కాగా, ఈ బార్​లో మొత్తం 50 మంది ఖైదీలను బంధించేందుకు మొత్తం 10 ప్రిజన్స్​ ఏర్పాటు చేశారు.

కస్టమర్లకు థ్రిల్లింగ్​ ఎక్స్​పీరియన్స్​..

ఆల్కోట్రాజ్ బార్​ అధికారిక వెబ్‌సైట్​లో దీనికి సంబంధించిన వివరాలను పొందుపర్చారు.​ కస్టమర్లు ఈ బార్​లోకి వెళ్లే ముందే వారి అధికారిక వెబ్‌సైట్‌లో £ 35.99 (రూ .3,695) చెల్లించి ఎంట్రీ టికెట్ బుక్ చేసుకోవాలి. కస్టమర్లకు హాలీవుడ్ మూవీస్​, థియేట్రికల్ కాక్టెయిల్ బార్ ఎక్స్​పీరియన్స్​ అందిస్తామని వెబ్​సైట్​లో పేర్కొంది. లండన్​లోని 212 బ్రిక్ లేన్​లో ఈ హిడెన్​ బార్​ ఉంది. బయటి ప్రపంచానికి కనిపించకుండా ఈ బార్​ను డిజైన్​ చేశారు. మాంచెస్టర్‌లోని బ్రైటన్‌కి చెందని సామ్ షీమాన్ అనే వ్యాపారవేత్త ఈ వెరైటీ బార్​ను నెలకొల్పారు. కొత్తగా ఆలోచిస్తూ కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ జైల్ బార్‌ను ఏర్పాటు చేసినట్లు షీమాన్ తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published: