• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • CUSTOMER TIPS WAITRESS USD 5000 ON A USD 205 BILL NETIZENS PRAISE NEWS WENT VIRAL MS

Viral: బిల్లు రూ. 5 వేలు.. టిప్పు రూ. 3.50 లక్షలు... ఈయన అసలైన దానకర్ణుడు

Viral: బిల్లు రూ. 5 వేలు.. టిప్పు రూ. 3.50 లక్షలు... ఈయన అసలైన దానకర్ణుడు

ప్రతీకాత్మక చిత్రం

కొందరైతే.. ఎందుకియ్యాలయ్యా టిప్పు..? అని కసురుకుంటారు కూడా. కొంత మంది మానవతావాదులు.. తమకు తోచినంత ఇస్తారు. మరీ మంచోళ్లు అయితే రూ. 100 నుంచి రూ. 500 దాకా ఇస్తారు. ఇక సంపన్నులైతే.. వారి దయాగుణం.

  • News18
  • Last Updated:
  • Share this:
    మనమెప్పుడైనా హోటల్ కో రెస్టారెంట్ కో వెళ్తే పుష్టిగా భోజనం చేసిన తర్వాత.. వెయిటర్ వచ్చి బిల్లు ఇస్తాడు. అది పే చేసిన వెంటనే అతడు.. టిప్ అని అడుగుతాడు. దానికే అతడేదో మన ఆస్తులడిగినట్టు చూస్తాం. కొందరైతే.. ఎందుకియ్యాలయ్యా టిప్పు..? అని కసురుకుంటారు కూడా. కొంత మంది మానవతావాదులు.. తమకు తోచినంత ఇస్తారు. మరీ మంచోళ్లు అయితే రూ. 100 నుంచి రూ. 500 దాకా ఇస్తారు. ఇక సంపన్నులైతే.. వారి దయాగుణం. అది కూడా మహా అయితే వేయి రూపాయలో.. లేదంటే రూ. 5 వేలు ఇస్తారు. కానీ రెస్టారెంట్ కు వచ్చిన ఒక వ్యక్తి.. టిప్ కింద 5 వేల డాలర్లు (అంటే మన కరెన్సీలో చూస్తే సుమారు రూ. 3.50 లక్షలు) ఇచ్చాడు. అసలైన దానకర్ణుడు అనిపించుకుంటున్నాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే...

    కరోనా కాలంగా చాలా మంది జీవితాలు ప్రభావితమయ్యాయి. ప్రపంవ్యాప్తంగా చాలా మంది దీని వలలో చిక్కుకుని అల్లాడుతున్నారు. దాదాపు అన్ని రంగాలు ఉద్యోగులను తీసేయడంతో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో చాలా మంది తమకు ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటున్నారు. అమెరికా లోని పెన్సిల్వేనియా కు చెందిన జియాన్నా డి అంజెలొ (gianna diAngelo) కూడా ఉపాధి కరువై చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. స్థానికంగా ఉండే కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్న జియాన్నా.. అక్కడే ఉండే ఇటాలియాన్ రెస్టారెంట్ లో వెయిట్రెస్ (Waitress) గా పనిచేస్తుంది.

    కాగా.. ఇటీవలే ఆ రెస్టారెంట్ కు వచ్చిన ఒక వ్యక్తి.. జియాన్నా ను పిలిచి ఆర్డర్ ఇచ్చాడు. బిల్లు రూ. 205 (సుమారు రూ. 5 వేలు) డాలర్లయింది. కానీ సదరు కస్టమర్ మాత్రం.. ఆమెకు మరో రూ. 5,000 డాలర్లు (రూ. 3,50,000) టేబుల్ మీద పెట్టి వెళ్లాడు. ఇది చూసిన జియన్నా ఆనందానికి అవధుల్లేవు. ఇదే విషయాన్ని జియాన్నా హోటల్ యాజమాన్యానికి తెలియజేసింది. దీంతో వాళ్లు.. ఈ విషయాన్ని ఫేస్బుక్ లో షేర్ చేశారు. ‘మాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మా సిబ్బందికి ఊహించని సపోర్టు అందిస్తున్నారు. మీకు వేల వేల థ్యాంక్స్..! మీ ప్రేమాభిమానాలను ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నాం..’ అని రాసుకొచ్చారు. నర్సింగ్ కోర్సు చదువుతున్న జియాన్నాకు ఈ డబ్బు ద్వారా ఆమెకు ఇబ్బందులు కొంత మేరకు తగ్గుతాయని.. ఆ హోటల్ యజమాని తెలిపాడు.



    హోటల్ యజమానికి పెట్టిన పోస్టు సోషల్ మీడియా లో వైరలైంది. దీనిపై చాలా మంది కామెంట్ చేస్తూ.. ఆ డబ్బును ఆమె చదువుకు వినియోగించుకోవాలని కామెంట్ చేస్తున్నారు. అంతేగాక.. ఆ దానకర్ణుడిపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. ప్రపంచంలో ఇలాంటి మంచివాళ్లను చూడటం చాలా ఆనందంగా ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. దీనిపై జియాన్నా స్పందిస్తూ.. ‘నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఈ డబ్బులను నేను కాలేజీ ఫీజు చెల్లించి.. మిగిలిన దానిని మంచి కార్యక్రమాల కోసం వాడతాను...’ అని తెలిపింది.
    Published by:Srinivas Munigala
    First published: