సముద్రంలో అపాయం... ఢీ కొట్టుకున్న రెండు నౌకలు...

ప్రమాదం జరిగినప్పుడు రెండు నౌకల్లోనూ ప్రయాణికులున్నారు. అలాగే... ఒయాసిస్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. లక్కీగా ఎవరికీ ప్రాణనష్టం కలగలేదు.

news18-telugu
Updated: December 21, 2019, 11:22 AM IST
సముద్రంలో అపాయం... ఢీ కొట్టుకున్న రెండు నౌకలు...
సముద్రంలో అపాయం... ఢీ కొట్టుకున్న రెండు నౌకలు... (credit - reuters)
  • Share this:
మెక్సికోలో జరిగిందీ ఘటన. కార్నివాల్ క్రూయిజ్ షిప్... మరో చిన్న కార్నివాల్ లెజెండ్ షిప్‌తో డాక్ (ఎటాచ్) కావాల్సి వచ్చింది. ఐతే... అప్పటికే చిన్న షిప్పు... పెద్ద షిప్పుతో డాక్ అయ్యేందుకు ముందుకు జరిగింది. అదే సమయంలో చిన్న షిప్పును పెద్ద షిప్పు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ఓ చిన్న పడవ మరో పడవను ఢీ కొడితే... పెద్దగా ఏమీ కాదు... కానీ ఆ నౌకలు ఒక్కోటీ ఒక్కో పర్వతంలా ఉంటాయి. వాటిలో ఓ నగర జనాభా పట్టేంత ప్రదేశం ఉంటుంది. ప్రమాదానికి కారణం ఏంటన్నదానిపై నిపుణులు ఆలోచిస్తున్నారు. గాలి కారణం కావచ్చని కొందరు, నౌక ఇంజిన్లలో ఏదో తేడా వచ్చి ఉంటుందని మరి కొందరు, ప్రొపల్షన్ సరిగా పనిచేయకపోవచ్చని మరో కారణాన్ని చెప్పుకుంటున్నారు. ఈ ప్రమాదాన్ని తమ మొబైళ్లలో షూట్ చేసిన ప్రయాణికులు... వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.


ఈ ప్రమాదాన్ని చూస్తున్న వాళ్లు... స్టాప్ స్టాప్ అని గట్టిగా అరిచినా ప్రయోజనం లేకపోయింది. రెండు నౌకలూ దెబ్బతిన్నాయి. ఐతే... ఎవరికీ ప్రాణనష్టం కలగకపోవడం సంతోషించదగ్గ విషయం.First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు