Video: ఈ కాకి దొంగ... డబ్బులు ఎత్తుకుపోతుంది.. ఏం చేస్తుందో మీరు ఓ లుక్కేయండి..

Video: ఈ కాకి దొంగ... డబ్బులు ఎత్తుకుపోతుంది.. ఏం చేస్తుందో మీరు ఓ లుక్కేయండి..

(Image-Twitter)

సోషల్ మీడియాలో జంతువులు, పక్షులుకు చెందిన వీడియోలు త్వరగా వైరల్ అవుతుంటాయి. జనాలు కూడా వాటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు.

  • Share this:
    సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కొన్ని వీడియోలైతే క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులు, ఫన్నీ డైలాగ్స్, ట్రెండింగ్ టాపిక్స్కు సంబంధించిన వీడియోలు చూడటానికి కూడా జనాలు ఇష్టపడుతుంటారు. గతంలో కొన్ని వీడియోలు.. కొన్నాళ్లకు మళ్లీ ట్రెండింగ్‌లో కనిపిస్తూ సందండి చేస్తూంటాయి. జనాలు కూడా ఇలాంటి వీడియోలను బాగా చూస్తుంటారు. తాజాగా ట్విట్టర్‌లో ఓ కాకి వీడియో హల్‌చల్ చేస్తోంది.

    ఆ కాకి చేసిన పని చూస్తే ఎవరైనా దాని తెలివిని మెచ్చుకోకుండా ఉండలేరు. ఎందుకంటే అది నోట్లో కరెన్సీ కాగితాలు పెట్టుకోవడమే కాకుండా ఓ ఇంట్లో ఉన్న గల్ల పెట్ట వద్ద వాలిపోయింది. 13 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో.. ఓ కాకి ఇంటి బాల్కనీ అవతలి వైపు నిల్చుని ఉంటుంది.దాని నోటిలో కొన్ని కరెన్సీని పోలిన కాగితపు ముక్కలు ఉన్నాయి. అది ఎక్కడి నుంచి వాటిని తీసుకొచ్చిందో తెలియదు.. ఆ ఇంట్లోని వ్యక్తి బాల్కనీ విండోస్ ఓపెన్ చేయడంతోని కాకి లోనికి దూరి.. వెంటనే ఓ డ్రా బాక్స్ వద్దకు చేరింది.





    Sputnik V: గుడ్ న్యూస్.. భారత మార్కెట్‌లోకి స్పుత్నిక్-వి వ్యాక్సిన్.. ఎప్పటి నుంచంటే..?

    అందులో డబ్బులు ఉంచేందుకు ప్రయత్నించినట్టుగా కనిపించింది. తీరా డ్రా బాక్స్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉన్నాయి. అంటే కాకి ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి.. ఇక్కడ జమ చేస్తుందా?.. లేక అక్కడి డబ్బులనే తీసుకెళ్లి పోతుందా అనేది స్పష్టత లేదు. మొత్తానికైతే డబ్బులను మాత్రం ఎక్కడి నుంచో ఎక్కడికో ఎత్తుకుపోతుంది. ఇక, ఈ వీడియోను @GorgeousPlanet_ అనే యూజర్ ఐడీ నుంచి ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది. ఆ వీడియోకు Men's best friend ever.. అనే క్యాప్షన్ కూడా జత చేశారు. ఇప్పటికే 2.7వేలకు పైగా ఈ వీడియోను వీక్షించారు. 88కి పైగా రీట్వీట్స్ వచ్చాయి.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు