Crocodile vs Deer: బిడ్డ కోసం తన ప్రాణాన్ని అడ్డేసిన అమ్మ.. మొసలి చేతిలో బలి.. హార్ట్ టచింగ్ వీడియో

image credits to twitter

Viral Video: అమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మనే, నడిచే దైవం అమ్మ అంటూ నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. తన పిల్లలందరినీ సమానంగా ప్రేమించే అమ్మ అవసరమైనప్పుడు తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా త్యాగాలకు వెనుకాడదనిదే అమ్మతనం.

  • News18
  • Last Updated :
  • Share this:
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు ఏ తల్లైనా ఎంతకైనా తెగిస్తుంది. ఈ విషయమే మరోసారి రుజువు చేసే వీడియో ఒకటి ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. తన కూన జింకను కాపాడుకునేందుకు తల్లి జింక చేసిన పని గుండెను పిండేలా ఉంది. నదిలో వేటకు వచ్చిన మొసలి మాటు వేసి జింక పిల్లను వేటాడేందుకు దగ్గరికి వచ్చేలోగా.. అటుపక్క నుంచి ఉన్నట్టుండి బిడ్డకు అడ్డుగా ఓ తల్లి జింక వస్తుంది. ఆ జింకను మొసలి వేటాడి తింటుంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతా నందా షేర్ చేసిన ఈ వీడియోను చూసిన వారంతా.. అమ్మతనంకు హద్దులు లేవని.. ప్రకృతిలోని అమ్మదనం గొప్పదనం ఇదేనంటూ .. నెటిజన్లంతా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మనే, నడిచే దైవం అమ్మ అంటూ నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. తన పిల్లలందరినీ సమానంగా ప్రేమించే అమ్మ అవసరమైనప్పుడు తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా త్యాగాలకు వెనుకాడదనిదే అమ్మతనం. తన బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు తన ప్రాణాలనే అడ్డు వేసిన ఈ జింకను చూస్తుంటే అందరికీ కంట్లో చెమ్మ ఉబికిరాక తప్పదు.

అమ్మ ప్రేమ ముందు బలాదూర్..

ఐఎఫ్ ఎస్ ఆఫీసర్ సుశాంతా నందా పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. "ప్రపంచంలోని శక్తులన్నీ అమ్మ ప్రేమముందు బలాదూరే" అంటూ షేర్ చేసిన వీడియో కంటతడి పెట్టించేలా ఉంది. ప్రాణికోటిలో అమ్మ అంటే అమ్మే అది మనుషులైనా జంతువైనా అమ్మతనం అమ్మతనమే దానికి తిరుగులేదనేలా ఓ మూగ జీవి వీడియో వైరల్ అవుతోంది. "ఈ వీడియో చూశాక నా గుండె పగిలిందంటూ" ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.





అమ్మలూ మీకు సలాం..

"జననీ దేవోభవ..ప్రపంచంలోని తల్లులందరికీ సలాం..’’ అని అత్యధిక నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. "నా జీవితంలో ఇంతటి అత్యున్నతమైన వీడియోను నేనెప్పుడూ చూడలేదంటూ" మరొక నెటిజన్ ట్వీట్ చేశారు. "ఇదెంత గొప్ప త్యాగం.. ఆఖరుకి బిడ్డ కోసం తన ప్రాణాన్నే తల్లి త్యాగం చేసిందంటూ" మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

చిలికా డెవలప్మెంట్ సీఈ..

ఒడిషాలోని చిలికా డెవలప్మెంట్ అథారిటీకి చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న సుశాంతా నందా తరచూ ఇలాంటి వీడియోలను షేర్ చేస్తుంటారు. ఒరిస్సాలోని చిలికా సరస్సు ప్రత్యేకత ఏమిటంటే ఇది మంచి నీటి సరస్సు. పైపెచ్చు ఎన్నో జీవరాశులకు, ప్రకృతి అందాలకు కేరాఫ్ గా నిలిచింది. ఉత్తరాఖండ్ లో ప్రకృతి సృష్టిస్తున్న భీభత్సంపై కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను ఆయన ఫొటోలు, వీడియోల ద్వారా అందిస్తున్నారు.
Published by:Srinivas Munigala
First published: