HOME »NEWS »TRENDING »cricketer yuvaraj singh posts bharatanatyam style of spin video goes viral in social media ms

Yuvaraj Singh: తకిట తకిట తకదిమి స్పిన్.. బంతి కంటే ముందే గింగిరాలు తిరుగుతున్న బౌలర్..

Yuvaraj Singh: తకిట తకిట తకదిమి స్పిన్.. బంతి కంటే ముందే గింగిరాలు తిరుగుతున్న బౌలర్..
image credits Instagram

బౌలింగ్ వేయడంలో ఒక్కోక్కరిది ఒక్కో శైలి. కానీ ఈ బౌలర్ మాత్రం విచిత్రమైన శైలితో అలరిస్తున్నాడు. బౌలింగ్ వేసేప్పుడు భరతనాట్యం చేస్తున్నవాడిలా రెండు, మూడు సార్లు గిరగిరా తిరుగుతూ బంతిని వేస్తున్నాడు. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvaraj singh) ఈ వీడియోను షేర్ చేశారు.

  • News18
  • Last Updated: January 18, 2021, 17:05 IST
  • Share this:
    క్రికెట్ ఆడేప్పుడు ఎవరైనా బౌలర్ బౌలింగ్ చేయడానికి వస్తే.. సదరు బౌలర్ అతడు ఎటు వైపు నుంచి బాల్ వేస్తున్నాడు..? శైలి ఏంటి..? అనే విషయాలను అంపైర్ కు చెప్పాలి. లేకుంటే అది నోబాల్ గా పరిగణించబడుతుంది. అందుకే సాధారణంగా బౌలర్లు.. వాళ్లు బంతి చేతికందుకోగానే.. ‘రైట్ ఆర్మ్.. మీడియం ఫాస్ట్..’ అనో లేక స్పిన్నర్లైతే ‘లెఫ్ట్ ఆర్మ్.. ఆఫ్ స్పిన్..’ అనో.. వారు ఎటువైపు నుంచి బాల్ వేస్తున్న వివరాలను చెబుతారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం విచిత్రమైన బౌలింగ్ స్టైల్ ను కలిగి ఉన్నాడు. మాములుగా స్పిన్నర్లు బంతులేస్తే.. బంతులు గిరగిరా తిరుగుతాయి.. కానీ అంతకంటే ముందే ఈ బౌలరే గింగిరాలు తిరుగుతున్నాడు. అచ్చం భరతనాట్యం చేసే నాట్యాకారులలాగా... ఈ లెక్కన అతడు తన శైలి గురించి ఎంపైర్ కు చెబితే...? ‘రైట్ ఆర్మ్.. తకిట తకిట తకదిమి స్పిన్’ అని చెప్పాలేమో....!

    బౌలింగ్ వేయడంలో ఒక్కోక్కరిది ఒక్కో శైలి. కానీ ఈ బౌలర్ మాత్రం విచిత్రమైన శైలితో అలరిస్తున్నాడు. బౌలింగ్ వేసేప్పుడు భరతనాట్యం చేస్తున్నవాడిలా రెండు, మూడు సార్లు గిరగిరా తిరుగుతూ బంతిని వేస్తున్నాడు. ఈ వీడియోను భారత క్రికెట్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ షేర్ చేశాడు.







    Instagram వేదికగా యువరాజ్ ఈ వీడయోను షేర్ చేశాడు. ఈ వీడియో ఎక్కడిది..? ఆ బౌలర్ ఎవరన్న దాని గురించి మాత్రం ఏం సమాచారం పంచుకోలేదు యువరాజ్. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘భరతనాట్యం స్టైల్ లో బౌలింగ్ చేయడం...’ అని రాసుకొచ్చాడు. అంతేగాక దీనిని టర్బోనేటర్ హర్బజన్ సింగ్ కు షేర్ చేస్తూ.. ఏమంటావ్ బజ్జీ....? అంటూ పోస్ట్ చేశాడు యువరాజ్..

    ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో ఇప్పటికే 3 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. లైకులు, షేర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనిపై ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘ఈ బౌలర్ బంతి కంటే ఎక్కువ తిరుగుతున్నాడు...’ అని పోస్టు చేశాడు. నెట్టింట ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
    Published by:Srinivas Munigala
    First published:January 18, 2021, 16:55 IST