Harbhajan Singh: భారత జట్టులో రీ-ఎంట్రీపై హర్భజన్ సింగ్ ఆశలు...

Cricket World Cup 2019 | మళ్లీ భారత జట్టు తరఫున ఆడేందుకు తాను సిద్ధమన్న హర్భజన్ సింగ్...మళ్లీ భారత జట్టు జర్సీని వేసుకోవడాన్ని గర్వంగా భావిస్తానని చెప్పాడు.

news18-telugu
Updated: April 9, 2019, 11:29 AM IST
Harbhajan Singh: భారత జట్టులో రీ-ఎంట్రీపై హర్భజన్ సింగ్ ఆశలు...
హర్బజన్ సింగ్
  • Share this:
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లలో హర్భజన్ సింగ్ ఒకరు. 700 వికెట్లకు పైగా సాధించిన ఈ జలంధర్ స్పిన్ మాంత్రికుడు...సమకాలీన ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మన్లు  మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడెజా రాకతో జట్టులో హర్భజన్ సింగ్ తన స్థానాన్ని కోల్పోయాడు. భారత జట్టులో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు హర్భజన్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. చివరగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియాకప్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టులో హర్భజన్ సింగ్ ప్రాతినిధ్యంవహించాడు.

భారత జట్టులో తనకు మళ్లీ చోటు దక్కుతుందని హర్భజన్ సింగ్ ఆశిస్తున్నాడు. తన అనుభవం అక్కరకు వస్తుందని భావించి ఆహ్వానిస్తే మళ్లీ భారత జట్టు తరఫున క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆడేందుకు తాను సిద్ధమని చెప్పాడు. జాతీయ జట్టుకు మళ్లీ ప్రాతినిధ్యంవహించడాన్ని తాను గర్వంగా భావిస్తానని అన్నాడు. బీసీసీఐ సెలక్టర్ల నుంచి పిలుపు వస్తే...తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని వ్యాఖ్యానించాడు.

ప్రస్తుత ఐపీఎల్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో హర్భజన్ సింగ్ ఆడుతున్నాడు. మూడు ఐపీఎల్ మ్యాచ్‌లలో హర్భజన్ సింగ్ ఐదు వికెట్లు సాధించి తన సత్తా చాటుకున్నాడు. తన బౌలింగ్‌లో పరుగులు కూడా పొదుపుగానే ఇచ్చి అందరి మెప్పు పొందాడు. సీఎస్కీకి ముందుగా 10 ఎడిషన్ల ఐపీఎల్ టోర్నీల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు హర్భజన్ సింగ్ ప్రాతినిధ్యంవహించాడు.
First published: April 9, 2019, 11:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading