Happy Birthday Dravid: నెటిజన్స్ మెచ్చిన ‘గ్రేట్ వాల్’ రాహుల్ ద్రవిడ్‌

రాహుల్ ద్రవిడ్ ( ఫైల్ ఫొటో)

Happy Birthday Rahul Dravid : మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ శనివారం తన 47వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. పలువురు క్రీడా ప్రముఖులతో పాటు నెటిజన్లు ద్రవిడ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

  • Share this:
    ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌’గా భారత క్రికెట్ అభిమానుల మన్ననలు పొందిన రాహుల్ ద్రవిడ్ శనివారం తన 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదిగకా ద్రవిడ్‌కి బర్త్ డే విషెస్ తెలిపారు. టీమిండియాకు 13 ఏళ్ల పాటు ద్రవిడ్ సేవలందించారు. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు వికెట్ల మధ్య గోడలా నిలిచిపోతూ...ఎన్నో సందర్భాల్లో ద్రవిడ్ జట్టును విజయం ఒడ్డుకు చేర్చిన సందర్భాలను క్రికెట్ అభిమానులు గుర్తుచేసుకున్నారు. నెం.3లో టీమిండియా చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు ద్రవిడ్ అంటూ కొందరు నెటిజన్లు అభినందనలు తెలిపారు. నెటిజన్స్ బర్త్ డే విషెస్‌తో #HappyBirthdayRahulDravid హ్యాష్ టాగ్ దేశంలో నెం.1 ట్రెండింగ్‌లో నిలిచింది.

    ద్రవిడ్‌కి బర్త్ డే విషెస్ తెలుపుతూ బీసీసీఐ ఓ వీడియోని ట్వీట్ చేసింది.



    రాహుల్ ద్రవిడ్‌కి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ 47వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ద్రవిడ్ తన బ్యాటింగ్‌తో బౌలర్ల జోరుకు పెద్ద అడ్డుకట్ట వేసేవారని గుర్తుచేసుకున్నారు.



    rahul dravid
    రాహుల్ ద్రవిడ్


    మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తనదైన శైలిలో ద్రవిడ్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. తనకు తెలిసి వంటగదిలోని మిక్సర్ గ్రైండర్‌లో మాత్రమే గ్రైండింగ్ చేస్తారని...అయితే క్రికెట్ పిచ్‌లో కూడా గ్రైండింగ్ చేయగల సమర్థుడు ద్రవిడ్ అంటూ నవ్వులు పూయించాడు.



    మాజీ  క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, కైఫ్, హర్భజన్ సింగ్ తదితరులు రాహుల్ ద్రవిడ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్  చేశారు.







    రాహుల్ ద్రవిడ్‌కి పలువురు క్రికెట్ అభిమానులు, నెటిజన్స్ బర్త్ డే విషెస్ తెలిపారు.

    Published by:Janardhan V
    First published: