Home /News /trending /

CRAZY FIGHT BREAKS BETWEEN 2 GIRLS INSIDE CLASSROOM AS THEY BEAT AND PULL EACH OTHERS HAIR PAH

Shocking: క్లాస్ రూమ్ లో రణరంగం.. జుట్లు పట్టుకుని కొట్టుకున్న బాలికలు.. వీడియో వైరల్..

గొడవ పడుతున్న విద్యార్థినులు

గొడవ పడుతున్న విద్యార్థినులు

Viral video: క్లాస్ రూమ్ లో విద్యార్థినులు న్యూసెన్స్ చేశారు. ఒకరి బట్టలు మరోకరు లాక్కున్నారు. జుట్టులు పట్టుకుని, ఇష్టమోచ్చినట్లు కొట్టుకుంటూ రణరంగం సృష్టించారు.

బాలికలు చాలా వరకు డీసెంట్ గా ఉంటారు. కానీ ఈ మధ్యలో అమ్మాయిలే ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. ఇప్పటి వరకు.. అనేక వీడియోలు వైరల్ గా (Viral video) మారాయి. కొన్ని చోట్ల బాయ్ ఫ్రెండ్ కోసం అమ్మాయిలకు మధ్య గొడవలు జరిగాయి. మరికొన్ని చోట్ల.. ఇతర కారణాలతో యువతులు పొట్టుపొట్టు కొట్టుకుంటూ బజారులో అల్లర్లు చేశారు. ఇలాంటి ఎన్నోవీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా, మరో వీడియో ట్రెండింగ్ లో నిలిచింది.

పూర్తి వివరాలు.. తరగతిలో బాలురు, బాలికలు కూర్చున్నారు. ఇంతలో వారి మధ్య మాట మాట పెరిగింది. అయితే.. ఒక బాలిక.. మరో అమ్మాయిని జుట్టుపట్టుకుని దాడిచేసింది. ఆ తర్వాత.. తిట్టుకుంటూ వీరికి మరికొందరు తోడయ్యారు. క్లాస్ లోనే ఒకరిపై మరోకరు దాడులు చేసుకుంటూ పొట్టుపొట్టు కొట్టుకున్నారు.










View this post on Instagram






A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)






అక్కడున్న అబ్బాయిలు.. మాత్రం భయపడి దూరంగా వెళ్లిపోతున్నారు. నవ్వుతూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. అమ్మాయిలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారంటూ కామెంట్ లను పెడుతున్నారు.

ఇదిలా ఉండగా నీళ్లలో పడిన ట్రక్ ను ఎత్తుతుండగా షాకింగ్ ఘటన జరిగింది.

పూర్తి వివరాలు.. ఒడిశాలో (Odisha) షాకింగ్ ఘటన జరిగింది. తాల్చేర్ పట్టణంలో ఒక ట్రక్ బ్రిడ్జ్ మీద నుంచి కిందకు పడిపోయింది. దీంతోస్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడు మరో రెండు క్రేన్ లను అక్కడికి తీసుకొచ్చారు. బ్రిడ్జ్ మీద క్రేన్ లను ఉంచి.. అడుగును పడిపోయిన ట్రక్ కు తాడుతో బిగించిపైకెత్తడానికి ప్రయత్నాలు చేశారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. క్రేన్ లు.. ట్రక్ ను ఒక్కసారిగా పైకి లాగడానికి ప్రయత్నించాయి.

అప్పుడు ఒక్కసారిగా రేయిలింగ్ తెగిపోయింది. దీంతో బరువంతా.. ఒకే క్రేన్ మీద పడింది. అప్పుడు.. క్రేన్ ఒక్కసారిగా అదే ట్రక్ మీద బోల్తా పడింది. దీంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. అక్కడున్న వారు... రికార్డు చేసిన వీడియోలో ఈ ఘటన రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వామ్మో.. ఇదేందిరా నాయన అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Students, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు