సిగరెట్‌ తాగుతున్న ఎండ్రకాయ.. కెమెరాను చూసి జంప్.. వైరల్ వీడియో

క్యాన్సర్ (కర్కాటక) రాశికి, ఎండ్రకాయకు సంబంధమేంటో ఇప్పుడు అర్థమయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని.. ఈ కాన్సర్ (కర్కాటకం)కి తెలియనట్లుంది అని మరో నెటిజన్ ఫన్నీగా ట్వీట్ చేశాడు.

news18-telugu
Updated: September 23, 2020, 6:43 AM IST
సిగరెట్‌ తాగుతున్న ఎండ్రకాయ.. కెమెరాను చూసి జంప్.. వైరల్ వీడియో
సిగరెట్‌ తాగుతున్న ఎండ్రకాయ.. కెమెరాను చూసి జంప్.. వైరల్ వీడియో
  • Share this:
మనుషులు ఉపయోగించే వస్తువులను జంతువులు ఉపయోగిస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. ఎక్కువగా కోతులు ఇలాంటి పనులు చేసి కామెడీ చేస్తుంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఎండ్రకాయ (పీత) మామూలుది కాదు. ఎక్కడ చూసిందో.. ఎలా నేర్చుకుందో.. కానీ ఏకంగా సిగరెట్లు తాగుతోంది. గుప్పు గుప్పు మంటూ సిగరెట్ల పొగను గాల్లోకి వదులుతోంది. నేచర్ లవర్ ఎస్ఆర్‌కే అనే ట్విటర్ యూజర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ''2020లో మరో వింత. పీత సిగరెట్ తాగుతోంది. వాట్సప్‌లో ఈ వీడియో వచ్చింది. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం'' అని క్యాప్షన్ పెట్టాడు. 35 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎవరో తాగి పడేసిన సిగరెట్‌ పీకను తన కొక్కేలతో పట్టుకొని నోట్లో పెట్టుకొని అచ్చం మనిషిలాగే ఊదుతోంది ఆ పీత. అంతేకాదు సిగరెట్‌ను పీల్చి పొగను గాల్లోకి వదులుతోంది. అలా రెండు మూడు సార్లు చేసింది. ఐతే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు పీత వేషాలను చూసి.. మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశారు. తనను కెమెరాల్లో చిత్రీకరిస్తున్నారని తెలుసుకొని ఆ పీత అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. 'ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగనివ్వరు.. ఎక్కడి నుంచి వస్తారో..' అనుకుందో ఏమో గానీ.. అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోయింది. కానీ సిగరెట్‌ను మాత్రం అస్సలు వదల్లేదు. అలాగే పట్టుకొని ముందుకు కదిలింది.

ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. క్యాన్సర్ (కర్కాటక) రాశికి, ఎండ్రకాయకు సంబంధమేంటో ఇప్పుడు అర్థమయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని.. ఈ కాన్సర్ (కర్కాటకం)కి తెలియనట్లుంది అని మరో నెటిజన్ ఫన్నీగా ట్వీట్ చేశాడు.


ఐఎఫ్ఎస్ అధికారిక సుశాంతనంద మాత్రం కాస్త విభిన్నంగా స్పందించాడు. క్యాన్సర్ కారక సిగరెట్‌ను క్యాన్సర్( పీత) తాగుతోంది. ఇది పీడకల లాంటింది. మనం వేసే చెత్తను పీత తీసుకుంది. మన ప్రవర్తన ద్వారా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.

మనషులు పడేసే వ్యర్థాలను జంతువులు, సముద్ర జీవులు తిని ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లతో తాబేళ్లు, చేపలు, పక్షులు పెద్ద మొత్తంలో మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనిషిలో మార్పు రావాలని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. మన స్వార్థంతో పర్యావరణ వ్యవస్థను సర్వ నాశనం చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 23, 2020, 6:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading