ఫుట్‌బాల్ క్రేజ్ ఆవుకు కూడా పట్టింది.. వైరల్ అవుతున్న వీడియో..

Trending News: ఆవు నిజంగానే ఫుట్‌బాల్ ఆడింది. ఏదో బాల్ దగ్గర పెట్టుకొని అటూ ఇటూ కదిలించడం కాదండీ.. మైదానమంతా పరుగెడుతూ ప్రొఫెషనల్ ఆటను చూపించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 2, 2019, 10:29 AM IST
ఫుట్‌బాల్ క్రేజ్ ఆవుకు కూడా పట్టింది.. వైరల్ అవుతున్న వీడియో..
ఫుట్‌బాల్‌తో ఆవు
  • Share this:
ఆవు ఫుట్‌బాల్ ఆడింది..! అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ.. నిజం. ఆవు నిజంగానే ఫుట్‌బాల్ ఆడింది. ఏదో బాల్ దగ్గర పెట్టుకొని అటూ ఇటూ కదిలించడం కాదండీ.. మైదానమంతా పరుగెడుతూ ప్రొఫెషనల్ ఆటను చూపించింది. ఫుట్‌బాల్ ఆటలో.. బాల్ తన వద్దే ఉంచుకోవడానికి ఆటగాళ్లు వేసే ఎత్తులు, కిక్ షాట్లు మనకు తెలిసిందే. అచ్చం ఫుట్‌బాల్ ప్లేయర్లను తలపించేలా.. బాల్ తన వద్దే ఉంచుకోవడానికి ఆవు చాలానే శ్రమించింది. వివరాల్లోకెళితే.. కొందరు యువకులు ఓ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఇంతలో అక్కడికి ఓ ఆవు వచ్చింది. వీళ్లు ఆట ఆడుతున్న క్రమంలో ఆ బాల్ వెళ్లి ఆవు కాళ్ల మధ్యలో ఆగిపోయింది. ఆ ఆవు.. బాల్‌ను కాళ్లతో తన్నుతూ.. ముక్కుతో కదిలిస్తూ అటూ ఇటూ కదిలించింది. అయితే, ఆ బాల్‌ను తీసుకోవడానికి యువకులు ఆవు వద్దకు వెళ్తే అది.. గద్దించింది. బాల్ వారికి దక్కకుండా అక్కడే ఉండిపోయింది.

ఓ యువకుడు ఆవుకు ముందు వెళ్లి దాన్ని ఆటపట్టించగా, మరో యువకుడు వెనక నుంచి బాల్‌ను తన్నేశాడు. ఆ బాల్‌ను అందుకున్న ఓ యువకుడు ఇక ఆడుకోవచ్చులే అనుకున్నాడు. కానీ, ఆ ఆవు వింటేనా... ఆ బాల్ తనకు కావాల్సిందే అంటూ వారి వెంట పరుగులు తీసింది. ఆ యువకులు ఫుట్‌బాల్‌ను కిక్ చేస్తూ వేరే వాళ్లకు సర్వీస్ చేసినా.. పట్టు వదలకుండా బాల్ వెంటే పరుగులు తీసింది. మొత్తానికి మళ్లీ ఫుట్‌బాల్‌ను తన వశం చేసుకుంది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్రికెటర్ హర్షబోగ్లే కూడా ఆ వీడియోను షేర్ చేస్తూ ఫన్నీ సన్నివేశం అంటూ కామెంట్ చేశారు. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది.

First published: July 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...