లగ్జరీ కారుకు ఆవు పేడ కోటింగ్... గో ప్రేమికుడి వినూత్న ప్రయోగం..

కారు బయట భాగంలో మొత్తం పేడ పూయడంతో లోపల ఏసీ వేసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయిందని చెబుతున్నాడు. నిజానికి పూర్వ కాలం నుంచి ఆవుపేడకు వేడిని గ్రహించని గుణం ఉందని పెద్దలు చెబుతుండే వారు. అయితే ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రూపేశ్ కారుపై నీట్ గా ఆవు పేడ కోటింగ్ ఇవ్వడంతో పెద్ద విషయంగా మారిపోయింది.

news18-telugu
Updated: May 21, 2019, 10:33 PM IST
లగ్జరీ కారుకు ఆవు పేడ కోటింగ్... గో ప్రేమికుడి వినూత్న ప్రయోగం..
(Image : Rupesh Gauranga Das/ facebook)
  • Share this:
వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కో చిట్కాను పాటిస్తుంటారు. అయితే తాజాగా అహ్మాదాబాద్‌కు చెందిన ఒక మహిళ మాత్రం ఎండ వేడిని తట్టుకోలేక ఏకంగా తన లగ్జరీ సెడాన్ కారుకు ఆవు పేడను పులిమేసింది. అంతేకాదు పేడ పూసిన కారు ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోను షేర్ చేసిన రూపేశ్ అనే గో ప్రేమికుడు ఇలా అందరూ చేయాలని  సలహా కూడా ఇస్తున్నాడు. అహ్మాదాబాద్ కు చెందిన ఆ మహిళ చేసిన ఈ పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫోటో షేర్ చేసిన రూపేశ్ మాత్రం కారు బయట భాగంలో మొత్తం పేడ పూయడంతో లోపల ఏసీ వేసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయిందని చెబుతున్నాడు. నిజానికి పూర్వ కాలం నుంచి ఆవుపేడకు వేడిని గ్రహించని గుణం ఉందని పెద్దలు చెబుతుండే వారు. అయితే ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న గుజరాతీ మహిళ కారుపై నీట్ గా ఆవు పేడ కోటింగ్ ఇవ్వడంతో పెద్ద విషయంగా మారిపోయింది. అయితే నెటిజన్లు మాత్రం మహిళ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు ప్రతీ ఒక్కరూ ఇలా వినూత్నంగా మన సంస్కృతిని కాపాడేల విధంగా ఆలోచించాలని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే దేశ వ్యాప్తంగా గో ఆధారిత ఉత్పత్తులపై అవగాహన బాగా పెరిగింది. మార్కెట్లో గో ఆధారిత అగరబత్తీలు, సబ్బులు, ఫ్లోర్ క్లీనర్లు వంటివి వాడుతున్నారు. అలాగే ఆవు పేడలో మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ ను సైతం ఎదుర్కొనే శక్తి ఉందని పలు పరిశోధనల్లో వెలువడింది. దీన్నే స్ఫూర్తిగా తీసుకున్న మహిళ చేసిన ప్రయత్నంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

First published: May 21, 2019, 8:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading