HOME »NEWS »TRENDING »cow dung cake taste review in amazon goes viral in social media sk

cow dung cake: పిడకలు తిని అమెజాన్‌లో రివ్యూ రాశాడు.. రుచి బాలేదని రచ్చ

cow dung cake: పిడకలు తిని అమెజాన్‌లో రివ్యూ రాశాడు.. రుచి బాలేదని రచ్చ
పిడకల టేస్ట్ రివ్యూ (Image:Amazon)

ఓ వ్యక్తి అమెజాన్‌లో పిడకలు కొని టేస్ట్ చేశాడట. దాని గురించి అమెజాన్ యాప్‌లో రివ్యూ రాశాడు. రుచి దరిద్రంగా ఉందని పేర్కొన్నాడు.

  • Share this:
    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్ వచ్చాక... అన్ని ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నాయి. పిన్నీస్ నుంచి ఏసీ దాకా.. వేప పుల్ల నుంచి రుద్రాక్ష దాకా.. అన్నీ అక్కడ లభ్యమవుతున్నాయి. బయటకు షాపింగ్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా.. ఫోన్ నుంచే జరిగిపోతున్నాయి. ఒక్క క్లిక్‌తో కావాల్సిన వస్తువులు ఇంటి ముందు వాలిపోతున్నాయి. ఆన్‌లైన్‌లో వస్తువులను కొని చాలా మంది రివ్యూలు రాస్తుంటారు. కొత్తగా కొనాలనుకునే వారికి ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. ఐతే ఓ వ్యక్తి ఆవు పిడకలు తిని రివ్యూ రాశాడు. పిడకలు తినడం ఏంటని షాక్ అవుతున్నారా? అవును.. పిడకలు తిని.. దాని రుచి గురించి వివరించాడు. ప్రస్తుతం ఆ రివ్యూ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఓ వ్యక్తి అమెజాన్‌లో పిడకలు కొని టేస్ట్ చేశాడట. దాని గురించి అమెజాన్ యాప్‌లో రివ్యూ రాశాడు. రుచి దరిద్రంగా ఉందని పేర్కొన్నాడు. ''నేను ఆ పిడక తిన్నప్పుడు రుచి ఏ మాత్రమూ బాగాలేదు. గడ్డి తింటున్నట్లుగా.. బురద తింటున్నట్లుగా అనిపించింది. నాకు విరేచనాలు అయ్యాయి. పిడకలు తయారుచేసేటప్పుడు శుభ్రత పాటించండి. రుచి అదిరిపోవాలి. '' అని పేర్కొన్నాడు. ఆ రివ్యూను చూసిన డాక్టర్ సంజయ్ అరోరా అనే వ్యక్తి.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది మన ఇండియా.. ఐ లవ్ మన ఇండియా అని ట్వీట్ చేశాడు.




    వాస్తవానికి ఆవు పిడకలను పూజలు, హోమాలు, ఇతర ధార్మిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. అంతేతప్ప వాటిని తినరు. అమెజాన్ కూడా దాని గురించి స్పష్టమైన వివరాలు పేర్కొంది. ''హోమాలు, పూజల్లో వాడేందుకు ఇది 100 శాతం నాణ్యమైనది. భారతదేశ ఆవు పేడతో వీటిని తయారు చేశారు. ఇవి చేతితో తయారు చేసినవి. పూర్తిగా ఎండబెట్టారు. పిడకలను మండిస్తే వాతావరణం శుద్ధి అవుతుంది. క్రిమి కీటకాలు చనిపోతాయి'' డిస్క్రిప్షన్‌లో ఇచ్చారు. కానీ మనోడు మాత్రం ఏకంగా తినేశాడు. ఐతే నిజంగానే తిన్నాడా.. లేదంటే పబ్లిసిటీ కోసమే రివ్యూ రాశాడా? అన్నది తెలియదు కానీ.. ఈ స్టోరీ మాత్రం వైరల్ అవుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:January 21, 2021, 08:24 IST