Home /News /trending /

COVID WARD TURNS INTO MARRIAGE HALL BRIDE MAKES ENTRY IN PPE IN KERALA ALAPPUZHA MEDICAL COLLEGE SU

పెళ్లి వేదికగా మారిన కోవిడ్ వార్డ్.. వరుడి కోసం కోవిడ్ వార్డుకు వచ్చిన వధువు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వార్డు పెళ్లి వేదికగా మారింది. కరోనా పాజిటివ్ నిర్దారణ అయి కోవిడ్ వార్డులో ఉన్న వరుడి కోసం వధువు.. అతను ఉన్నచోటుకే వచ్చింది.

    కరోనా సేకండ్ వేవ్ విజృంభణ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. వేల సంఖ్యలో ప్రాణాలను కరోనా బలితీసుకుంటుంది. అలాగే చాలామంది జీవితాలను తలక్రిందులు చేస్తోంది. కరోనా నేపథ్యంలో పలువురు తమ వివాహలను సైతం వాయిదా చేసుకుంటున్నారు. మరికొందరు పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించి భయం భయంగా శుభకార్యం నిర్వహిస్తున్నారు. ఇక, పెళ్లికి కొన్ని గంటల మందు కూడా కరోనా నిర్ధారణ కలకలం కారణంగా.. వేడుకలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఓ జంట మాత్రం కరోనా సమయంలోనూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వరుడికి కరోనా సోకినప్పటికీ పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకకు కోవిడ్ వార్డు వేదికగా నిలిచింది. కోవిడ్ వార్డ్‌లోనే వధూవరుల పెళ్లి జరిగింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.

    అలప్పుజా జిల్లా‌లోని కైనాకరి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామిలకు వివాహం నిశ్చయమైంది.  ఏడాది క్రితమే వీరి పెళ్లి ఫిక్స్ అయింది. అయితే విదేశాల్లో పనిచేస్తున్న వరుడు శరత్‌ ఆంక్షల కారణంగా ఇండియాకు రాలేకపోయాడు. అయితే ఇటీవలే అతడు ఇండియాకు చేరుకోగా.. పెళ్లి పనులు జరుగుతున్న సమయంలో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత శరత్ తల్లికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో శరత్‌, అతని తల్లిని అలప్పుజా మెడికల్ కాలేజ్‌లోని కోవిడ్ వార్డుకు తరలించారు. మరోవైపు పెళ్లి సమయం దగ్గరపడుతుంటడంతో.. ముందుగా అనుకున్న ప్రకారమే ఏప్రిల్ 25న శరత్, అభిరామిల వివాహం జరపాలని ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిర్ణయానికి వచ్చారు.

    దీంతో కోవిడ్ వార్డ్‌లోనే పెళ్లి చేయాలని అనుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఇతర సంబంధిత అధికారులు అనుమతులు తీసుకున్నారు. ఇక, కోవిడ్ వార్డ్‌లోనే పెళ్లి జరపడానికి రెడీ అయ్యారు. పెళ్లి కోసం వధవు, ఆమెతో పాటు ఓ బంధువు పీపీఈ కిట్లు ధరించి కోవిడ్ వార్డులోకి వెళ్లారు. అక్కడ వారికి వరుడి తల్లి దండలు అందజేసింది. పెళ్లి తర్వాత వధువు తిరిగి ఇంటికి చేరుకుంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Covid hospital, Kerala, Marriage

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు