• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • COVID VIRAL VIDEO PASSENGERS GOT ANGRY WITH A MAN WHO NOT WEAR MASK AND PUSH HIM OUT OF THE TRAIN WATCH VIDEO HERE NK

Video: మాస్క్ లేకుండా రైలు ఎక్కాడు... బలవంతంగా బయటకు నెట్టేసిన ప్రయాణికులు

మాస్క్ లేకుండా రైలు ఎక్కాడని... (image credit - twitter)

Video: ఈ కరోనా కాలంలో బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి అయ్యింది. ఈ విషయంలో రాజీ పడితే కరోనాను ఆహ్వానించినట్లే అంటున్నారు ప్రజలు.

  • Share this:
    Video: మాస్క్ పెట్టుకోని యువకుణ్ని రైల్లోంచి బలవంతంగా బయటకు నెట్టేసిన ఘటన యూరప్ దేశం స్పెయిన్‌లో జరిగింది. ప్రపంచ దేశాల్లో కరోనా ఇంకా తగ్గిపోలేదు. ఇండొనేసియా, బ్రిటన్ లాంటి దేశాల్లో థర్డ్ వేవ్ మొదలైంది కూడా. అయినా సరే ఇప్పటికీ చాలా మంది మాస్క్ పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. నిజానికి మాస్క్ అనేది మనకు చాలా చిరాగ్గా ఉంటుంది. ముక్కు, మూతికి చెమటపట్టేస్తూ ఇబ్బందిగా ఉంటుంది. "దీని బదులు కరోనా వచ్చినా పర్లేదు... మాస్క్ వద్దురా నాయనా" అనిపిస్తుంది. అయినా సరే మాస్క్ ధరించడమే మంచిది. తద్వారా మనకు కరోనా సోకకుండా చేసుకోవచ్చు. అలాగే... మనకే కరోనా ఉంటే... అది ఇతరులకు సోకకుండా చేసినట్లు అవుతుంది. అందుకే మాస్క్ మస్ట్ అంటున్నాయి చాలా దేశాలు.

    ట్విట్టర్‌లో ఓ వీడియో ట్వీట్ ఇప్పుడు బాగా షేర్ అవుతోంది. అందులో... ఓ కుర్రాడు మాస్క్ లేకుండా... ట్రైన్ ఎక్కాడు. ఓ యువతి... మాస్క్ పెట్టుకోమని చెప్పింది. కానీ అతను పెట్టుకోలేదు. దాంతో ఆమె వాదనకు దిగింది. పెట్టుకుంటావా లేదా పెట్టుకో అంటూ గద్దించింది. దాంతో ఆ యువకుడు మాస్క్ లేదంటూ రివర్స్ వాదనకు దిగాడు. అలాగైతే రైలు దిగిపో అంటూ ఆమె ఆర్డరేసింది. మిగతా ప్యాసింజర్లు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆ యువకుడు రైలు దిగేది లేదని పట్టుపట్టడంతో... ఎందుకు దిగవో చూస్తామంటూ... అందరూ కలిసి అతన్ని రైల్లోంచీ బయటకు నెట్టేశారు. అప్పటికి రైలు ఇంకా కదల్లేదు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.


    ఈ వీడియో సూపర్ వైరల్ అయ్యింది. దీన్ని ఇప్పటికే 2.61 లక్షల మంది చూశారు. ప్రయాణికులు సరిగ్గానే చేశారని చాలా మంది సపోర్టుగా కామెంట్లు రాస్తున్నారు. కొంత మంది యూజర్లు మాత్రం... మాస్క్ పెట్టుకోనంత మాత్రాన మరీ అంతలా ఇబ్బంది పెట్టడం కరెక్టు కాదు అంటున్నారు. అతన్ని సముదాయించి... ప్రశాంతంగా రైలు దిగేలా చేయాల్సింది అంటున్నారు.

    ఇది కూడా చదవండి: అమ్మా... మావయ్య ఒళ్లంతా తడుముతున్నాడు.. ఏం చెయ్యను.. ఆ వివాహిత ఏం చేసిందంటే...

    ప్రస్తుతం స్పెయిన్‌లో ప్రశాంతత లేదు. గత నెల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అధికారులు కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసి... కఠిన ఆంక్షలు పెడుతున్నారు. దేశంలోని చాలా చోట్ల కర్ఫ్యూ అమల్లో ఉంది. దేశ సరిహద్దులు మాత్రం తెరిచే ఉన్నాయి. స్పెయిన్‌లో మొన్న కొత్తగా 31వేల కేసులు రాగా... 12 మంది చనిపోయారు.
    Published by:Krishna Kumar N
    First published: