• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • COVID VACCINATION WOMAN BRUTALLY ATTACKED BMC WORKER FOR STOPPING HER NOT WEARING MASK NK

Mask Fight: మాస్క్ పెట్టుకోమంటే ముష్టి యుద్ధం.. రెచ్చిపోయిన మహిళ... వైరల్ వీడియో

Mask Fight: మాస్క్ పెట్టుకోమంటే ముష్టి యుద్ధం.. రెచ్చిపోయిన మహిళ... వైరల్ వీడియో

మాస్క్ పెట్టుకోమంటే ముష్టి యుద్ధం.. రెచ్చిపోయిన మహిళ... వైరల్ వీడియో (image credit - twitter)

Coronavirus updates: మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అని అడిగింది... అంతే... నీకేంటే బాధ అంటూ... చితకబాదేసింది. ఇలాగైతే ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

  • Share this:
    Coronavirus updates: కరోనా వచ్చి సంవత్సరం దాటింది. ఇప్పటికీ చాలా మందికి మాస్క్ పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఇలాంటి అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. మన మంచికే కదా... మాస్క్ వాడండి అంటే చాలా మందికి కోపం వస్తోంది. మహారాష్ట్రలో కరోనా ఎంత తీవ్రంగా ఉందో మనకు తెలుసు. నిన్న అక్కడ కొత్తగా 25.7వేల కరోనా కేసులు వచ్చాయంటే... పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా కొంత మంది మాస్క్ వాడటానికి ఇష్టపడట్లేదు. తాజాగా గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)కి చెందిన ఓ ఉద్యోగిని... ఓ మహిళ ఆటో ఎక్కుతుంటే ఆపి... "ఏమ్మా మాస్క్ పెట్టుకోకుండా ఆటో ఎక్కుతున్నావ్" అని అంది.

    అంతే ఆటోలో మహిళ అపరకాళికలా మారిపోయింది. "ఎంత ధైర్యం నీకు... నాపై చెయ్యి వేస్తావా... నన్ను టచ్ చేస్తావా... నీకేంటే బాధ... నా ఇష్టం... నేను మాస్క్ పెట్టుకుంటాను... పెట్టుకోను... నీకేంటి నొప్పి" అంటూ వీర లెవెల్లో రెచ్చిపోయింది. జుట్టు పట్టుకొని లాగుతూ... పిడిగుద్దులు గుద్దింది. కనీసం అవతల ఉన్నది BMC మున్సిపల్ ఉద్యోగిని అన్న జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించింది.

    ఇంతలో అక్కడికి వచ్చిన మరో మహిళా ఉద్యోగిని... బాధితురాలికి అండగా నిలిచింది. ముంబై... కండీవాలీ రోడ్డుపై జరిగిన ఈ దృశ్యాన్ని అంతా ఆశ్చర్యపోతూ చూశారు. "వామ్మో ఏంది అలా కొడుతోంది... ఓర్నాయనో" అనుకుంటూ స్థానికులు షాక్ అవుతూ చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో మీరూ చూడండి. ఎలా కొడుతోందో చూడండి.


    ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలోకి వెళ్లింది. చాలా మంది BMC ఉద్యోగినికి అండగా నిలుస్తున్నారు. మాస్క్ ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలని కోరుతున్నారు. దేశంలోనే 60 శాతం కరోనా కొత్త కేసులు రోజూ మహారాష్ట్రలో వస్తున్నాయి. ముంబైలో మరింత ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఎలా ఆపాలో తెలియక అక్కడి ప్రభుత్వం భారీ ఫైన్లు వేస్తున్నా... ఫలితం దక్కట్లేదు. కొన్ని చోట్ల లాక్‌డౌన్లు, కంటైన్‌మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేసింది.

    ప్రస్తుతం మహారాష్ట్రలో మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాలకు వస్తే రూ.200 ఫైన్ వేస్తున్నారు. అయినా సరే... ఈ మహిళ లాంటి వారు మాస్క్ పెట్టుకోకుండా ఎదురుతిరుగుతున్నారు. మరి ఆ మహిళపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో త్వరలో తెలుస్తుంది.

    ఇది కూడా చదవండి: ఆ నాలుగు దేశాల మహిళల్ని పెళ్లాడొద్దు... తాజా ఆదేశాలతో మగాళ్లకు షాక్

    ఇండియాలో కరోనా అప్‌డేట్:
    కరోనా వైరస్ కేసులు, మరణాలు ఇండియాలో మరింత పెరిగిపోయాయి. కొత్తగా 40,953 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284కి చేరింది. కొత్తగా 188 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,59,558 అయ్యింది. మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 23,653 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,11,07,332కి చేరింది. రికవరీ రేటు 96.1 శాతంగా ఉంది. మన దేశంలో ప్రస్తుతం 2,88,394 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో నిన్న 10,60,971 టెస్టులు చెయ్యగా... మొత్తం టెస్టుల సంఖ్య 23,24,31,517కి చేరింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు