• HOME
 • »
 • NEWS
 • »
 • TRENDING
 • »
 • COVID VACCINATION CUSTOMER REMOVES UNDERWEAR TO USE AS FACE MASK IN A SUPERMARKET OF SOUTH AFRICA NK

Underwear Mask: అండర్‌వేర్ తీసి మాస్కుగా పెట్టుకున్న మహిళ... వైరల్ వీడియో

Underwear Mask: అండర్‌వేర్ తీసి మాస్కుగా పెట్టుకున్న మహిళ... వైరల్ వీడియో

అండర్‌వేర్ తీసి మాస్కుగా పెట్టుకున్న మహిళ... (image credit - twitter)

Underwear Mask: కరోనా వచ్చాక ప్రపంచ ప్రజలు 2గా విడిపోయారు. వారే మాస్కును సమర్థించేవారు, వ్యతిరేకించేవారు. ఆమె ఎందుకు అండర్‌వేర్ తీసి మాస్కుగా పెట్టుకుందో తెలుసుకుందాం.

 • Share this:
  Underwear Mask: ఇదో దురదృష్టకర ఘటన అనుకోవచ్చు. ఈ రోజుల్లో రూ.10కి కూడా మాస్కులు లభిస్తున్నాయి. కొనగలిగే స్తోమత ఉండి కూడా కొంత మంది మాస్కులు వాడట్లేదు. మాస్క్ పెట్టుకోమంటే... కింది నుంచి పైదాకా అదేదో నేరం అన్నట్లు చూస్తున్నారు. ఇక్కడా అలాంటి ఘటనే జరిగింది. అది సౌత్ ఆఫ్రికా (దక్షిణాఫ్రికా)లోని ఓ సూపర్ మార్కెట్. దాని పేరు పిక్ అండ్ పే. బయట బోర్డ్ పెట్టారు. మాస్క్ లేకపోతే లోపలికి ఎంట్రీ లేదని. అయినా సరే ఓ మహిళ మాస్క్ లేకుండా లోపలికి వచ్చింది. మీకు తెలుసుగా... ఇప్పుడు సౌతాఫ్రికాలో కరోనా తీవ్రంగా ఉంది. అక్కడో ప్రమాదకర స్ట్రెయిన్ (రూపాంతర వైరస్) బాగా వ్యాపిస్తోంది. అందువల్ల మాస్క్ తప్పనిసరి చేస్తున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోని ఆమె... మాస్క్ లేకుండా దర్జాగా సూపర్ మార్గెట్‌లో తిరగసాగింది.

  తనకు కావాల్సిన సామాన్లు తీసుకున్న తర్వాత ఆ మహిళ బిల్లింగ్ కోసం క్యూలో ఉండగా... సెక్యూరిటీ గార్డు ఆమెను మాస్క్ పెట్టుకోమని చెప్పాడు. ఆమె మాస్క్ లేదని చెప్పింది. మాస్క్ లేకపోతే... బిల్లింగ్ ఉండదని చెప్పాడు. దాంతో ఆమెకు కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆమె ఎవరూ ఊహించని రీతిలో చూపించింది. వెంటనే తన అండర్ వేర్ తీసి... దాన్నే మాస్కులా వేసుకొని... ఓకేనా అంది. సెక్యూరిటీ గార్డుతోపాటూ... అందరూ ఆశ్చర్యపోయారు. ఆ షాకింగ్ వీడియోని మీరూ చూడండి.


  సపోజ్ మాస్క్ కావాలంటే ఆమె అదే సూపర్ మార్కెట్‌లో ఎలాగూ మాస్కులు అమ్ముతారు. ఒకటి కొనుకకోవచ్చు. లేదంటే... ఏ కర్చీఫో కొనుక్కొని మాస్కులా పెట్టుకోవచ్చు. లేదంటే... ఇంటికి వెళ్లి మాస్క్ తెచ్చుకోవచ్చు. ఇన్ని ఆప్షన్లు ఉన్నా... మరో ఆప్షన్ ఎంచుకోవడానికి కారణం... మాస్క్ పెట్టుకునే ఉద్దేశం అసలు ఆమెకు లేకపోవడమే.

  ఇలాంటి వాళ్లు మన ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఏకంగా 2 మాస్కులు పెట్టుకుంటుంటే... మొన్నటి దాకా ఆ పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మాస్క్ వాడిందే చాలా తక్కువ. మాస్క్ పెట్టుకోమంటే అదేదో తప్పులా, నేరంలా భావిస్తున్నారు ఈ మహిళ లాంటి వారు.


  కరోనాకి ముందు ఎన్నో వైరస్‌లు వచ్చాయి. అవన్నీ మన దేశం దాకా రాలేదు. కారణం... జపాన్, చైనా, హాంకాంగ్ లాంటి దేశాల్లో ప్రజలు మాస్కులు వాడటం వల్లే. వాళ్లు కూడా ఈ మహళ లాగా మొండికేసి ఉంటే... మనం ఇదివరకే సార్స్, మెర్స్ వంటి వైరస్‌ల బారిన పడేవాళ్లం. ఇండియాలో కూడా మాస్క్ వాడినంతకాలం కరోనా కంట్రోల్‌లో ఉంది. ఇప్పుడు దాని వాడకం తగ్గే సరికి మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.

  ఇది కూడా చదవండి: Kohlrabi health benefits: కొహ్లరాబీతో 10 ఆరోగ్య ప్రయోజనాలు

  ఇదంతా చదివిన చాలా మంది అసలు మాస్క్ లేకుండా ఆమెను లోపలికి ఎందుకు వెళ్లనిచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. ఐతే... ఆమె కంటే ముందు ఉక్రెయిన్‌లో కూడా ఓ మహిళ ఇలాగే చేసింది. పోస్టాఫీసులో చేసిన ఆ పనికి విమర్శలు ఎదుర్కొంది. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో మరో మహిళ మాస్క్ మర్చిపోయి... దాని బదులుగా శానిటరీ ప్యాడ్‌ను మాస్కులా వాడింది.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు