COVID 19 LOCKDOWN IN CHINA HAS REPORTEDLY LED TO A WOMAN GETTING STUCK AT THE HOUSE OF A MAN SHE MET ON A BLIND DATE GH SK
Lockdown: యువకుడి ఇంటికెళ్లిన యువతి.. ఇంతలో లాక్డౌన్.. ఎరక్కపోయి ఇరుక్కుంది..
Viral News: అతడు తనకు వంట చేసి పెడుతున్నాడని... కాకపోతే అతడు ఎక్కువగా మాట్లాడటం లేదని వాపోయింది. చెక్క బొమ్మలా సైలెంట్ గా ఉన్నాడని.. ఎలాంటి రొమాన్స్ జరగడం లేదని చెప్పుకొచ్చింది.
Viral News: అతడు తనకు వంట చేసి పెడుతున్నాడని... కాకపోతే అతడు ఎక్కువగా మాట్లాడటం లేదని వాపోయింది. చెక్క బొమ్మలా సైలెంట్ గా ఉన్నాడని.. ఎలాంటి రొమాన్స్ జరగడం లేదని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం చైనా (China) దేశం జీరో కోవిడ్-19 (zero Covid-19) వ్యూహం అనుసరిస్తోంది.ఇందులో భాగంగా వైరస్ కేసులు వెలుగు చూసిన కమ్యూనిటీల్లో వేగంగా లాక్డౌన్లు విధిస్తోంది. ఒక్క కేసు వచ్చినా ఊరి ప్రజలందరినీ బలవంతంగా లాక్కెళ్లి క్వారంటైన్ శిబిరాల్లోకి పడేస్తోంది. ఇలాంటి సమయంలో ఓ యువతి బ్లయిండ్డేట్ (Blind Date) ప్లాన్ చేసింది. డేటింగ్ అంటూ ఝెన్ఝౌ (Zhengzhou) నగరంలోని ఓ యువకుడి ఇంటికి ఎగేసుకుపోయింది. తీరా అబ్బాయి ఇంటికి వెళ్లాక ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించారనే షాకింగ్ న్యూస్ తెలిసి ఖంగు తిన్నది. ఇప్పుడీ చైనా (China) యువతి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఈమె ఇప్పటికే నాలుగు రోజుల పాటు అబ్బాయి ఇంట్లో గడిపేసింది. అపరిచిత వ్యక్తి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆమె విచాట్ (WeChat) అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ పెట్టింది.
ఇప్పుడా పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాలుగు రోజులపాటు అబ్బాయి ఇంట్లో చిక్కుకున్న ఈ అమ్మాయి.. ఆ తర్వాతనైనా ఇంటికి వెళ్లిందో లేదో ఇంకా తెలియరాలేదు. కానీ ఝెన్‌ఝౌలో మాత్రం ప్రస్తుతం కరోనా ఉధృతి కొనసాగుతోంది. వారం రోజుల్లోనే అక్కడ వందకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
వాంగ్ అనే యువతికి వయసు అయిపోతోందనే భయంతో ఇటీవలే 10 బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేశారు తల్లిదండ్రులు. అయితే ఈ 10 డేట్లలో 5వ డేట్ కోసం అరెంజ్ చేసిన ఒక అబ్బాయి తాను వంట బాగా వండుతానని అని చెప్పాడట. తన వంటలు రుచి చూడటానికి ఆమెను ఇంటికి కూడా ఆహ్వానించాడట. అప్పటికి ఝెన్‌ఝౌలో లాక్డౌన్ విధించలేదు. దాంతో వాంగ్ లూనర్ న్యూ ఇయర్ సందర్భంగా అతడి ఇంట్లో కాసేపు గడిపి డిన్నర్ చేసి రావాలనుకుంది. అలా ఆమె గ్వాంగ్జౌలోని తన ఇంటి నుంచి అతడి ఇంటికి చేరుకుంది. అలా చేరుకొని అతని వంట రుచి చూసిందో లేదో ఝెన్ఝౌ నగరంలోని కొన్ని ప్రాంతాలు అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించారు. ఈ విషయం తెలిసి ఆమె గుండె గుభేల్ మంది. ఆ తర్వాత తన గోడును వెళ్లబోసుకుంటూ ప్రతి రోజూ షార్ట్ వీడియోలనుషేర్ చేస్తోంది.
ఈ వీడియోలలో తన బ్లయిండ్ డేట్ అబ్బాయి.. తనకు వంట చేసి పెడుతున్నాడని చెప్పింది. కాకపోతే అతడు ఎక్కువగా మాట్లాడటం లేదని.. చెక్క బొమ్మలా సైలెంట్ గా ఉన్నాడని.. ఎలాంటి రొమాన్స్ జరగడం లేదని చెప్పుకొచ్చింది. వాంగ్ బాగా మాట్లాడే భాగస్వామి కోసం వెతుకుతుందట. కానీ ఈ అబ్బాయి అలా ఉండకపోవడంతో అతనితో అంటీ ముట్టనట్లుగానే ఉంటుంది. ఈ వీడియో క్లిప్ లలో ల్యాప్‌టాప్‌లో అతడు వర్క్ చేస్తూ కనిపించాడు.
వాంగ్ తన వయస్సు లేదా వీడియోలలో ఉన్న వ్యక్తి గుర్తింపును వెల్లడించలేదు. సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లు బుధవారం నాటికి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్ వీబోలో ఆరు మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించాయి. అయితే ఇటీవల ఆమె వీడియోలు విపరీతంగా వైరల్ కావడంతో.. సదరు అబ్బాయి తనను వీడియోలను తీసివేయమని కోరినట్లు ఆమె చెప్పింది. "స్నేహితులు అతనికి కాల్ చేస్తున్నారు. ఇది అతని జీవితాన్ని కచ్చితంగా ప్రభావితం చేసిందని నేను భావిస్తున్నాను, కాబట్టి నేను ఆ వీడియోలను ప్రస్తుతానికి తీసివేసాను" అని ఆమె మంగళవారం పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది. అది చైనా స్థానిక మీడియాలో విస్తృతంగా ప్రచురించడం జరిగింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.