• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • COVID 19 HERES WHAT YOU NEED TO KNOW BEFORE BUYING PULSE OXIMETER MK GH

Pulse Oximeter: ఆక్సీమీట‌ర్ కొంటున్నారా? ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి

Pulse Oximeter: ఆక్సీమీట‌ర్ కొంటున్నారా? ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి

ప్రతీకాత్మకచిత్రం

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ అనేది చేతిలో ఒదిగిపోయే ఒక చిన్న ప‌రిక‌రం. దీన్ని వాడ‌టానికి వ్య‌క్తి త‌న వేలిని క్లిప్ లాంటి ఈ ఆక్సీమీట‌ర్‌లో పెట్టాలి. త‌ర్వాత కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే వారి శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిని ఇది నమోదు చేస్తుంది.

  • Share this:
రెండో దశలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో వైరస్ ప్రభావం నేరుగా ఊపిరితిత్తులపై పడుతోంది. ఫలితంగా కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దశలో ఆక్సిజన్ అందివ్వకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. అందువల్ల కోవిడ్ సోకినవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే ఆక్సిజ‌న్ స్థాయులను కొలుచుకోవాలి. ఇందుకు పల్స్ ఆక్సీమీట‌ర్‌ను వాడాల్సి ఉంటోంది. శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్షించుకోవ‌డానికి ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ స‌హాయ‌ప‌డుతుంది. అయితే వీటి వాడకంపై నిపుణులు భిన్నమైన అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఇవి ఒక్కోసారి రీడింగ్ త‌ప్పు చూపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సీమీటర్‌ పనితీరు గురించి వినియోగదారులు పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ అంటే ఏంటి?
ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ అనేది చేతిలో ఒదిగిపోయే ఒక చిన్న ప‌రిక‌రం. దీన్ని వాడ‌టానికి వ్య‌క్తి త‌న వేలిని క్లిప్ లాంటి ఈ ఆక్సీమీట‌ర్‌లో పెట్టాలి. త‌ర్వాత కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే వారి శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిని ఇది నమోదు చేస్తుంది. Spo2 యూనిట్ల‌లో ఇది ఆక్సిజన్ స్థాయిని కొలుస్తుంది. ఆరోగ్యవంతులకు ఇది 95 శాతం, అంత‌కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో అనారోగ్య ప‌రిస్థితుల‌ను బట్టి దీని రీడింగ్ 95 శాతం కంటే త‌క్కువ‌గా చూపిస్తుంది. రీడింగ్ 92-93 శాతానికి ప‌డిపోతే, వెంటనే వైద్యుల‌ స‌హాయం తీసుకోవాలి. ఈ ప‌రిక‌రం గుండె కొట్టుకునే రీడింగ్‌ని కూడా చూపిస్తుంది. ఆరోగ్యవంతుల‌కు నిమిషానికి 60 నుంచి 100 సార్లు హార్డ్ బీటింగ్ ఉంటుంది.

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ఎలా ప‌నిచేస్తుంది?
ఈ ప‌రిక‌రంలో వేలిని ఉంచిన త‌ర్వాత.. గుండె నుంచి శ‌రీర భాగాల‌కు ఎంత ఆక్సిజ‌న్ చేరిందో ఆక్సీమీటర్ గుర్తిస్తుంది. ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ఇంట్లో ఉండ‌టం మంచిది. దీనితో త‌ర‌చుగా మీ ఆక్సిజ‌న్ స్థాయిల‌ను ప‌ర్య‌వేక్షించుకోవ‌చ్చు. ఒక‌వేళ ఆక్సిజ‌న్ స్థాయి త‌గ్గితే ఎలాంటి ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే వైద్య స‌హాయం పొందవచ్చు. గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతంగా ఉన్న‌ప్పుడు క‌రోనా సోకి, హోమ్ ఐసోలెష‌న్‌లో ఉన్న రోగుల‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం ఆక్సీమీట‌ర్‌ను ఉచితంగా అందించింది. ఇప్ప‌డూ దీని అవ‌స‌రాన్ని ప్ర‌జ‌లు గుర్తిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు