దేశంలో ఏకైక బంగారు పులి... తెరవెనక కజిరంగా పార్క్ విషాద కథ

రెండ్రోజుల కిందట... బంగారు పులిపై దేశవ్యాప్తంగా పాజిటివ్ కథనాలు వచ్చాయి. కానీ... అసలు విషాదం కజిరంగా పార్క్ వారికి మాత్రమే తెలుసు. అదేంటంటే...

news18-telugu
Updated: July 14, 2020, 9:35 AM IST
దేశంలో ఏకైక బంగారు పులి... తెరవెనక కజిరంగా పార్క్ విషాద కథ
దేశంలో ఏకైక బంగారు పులి... (credit - twitter)
  • Share this:
అసోంలోని ప్రపంచ వారసత్వ సంపద... కజిరంగా నేషనల్ పార్క్... చాలా పెద్దది, విశాలమైనది. దేశంలో ఏకైక బంగారు పులి (Golden Tiger) అక్కడే ఉంది. అది మనకు గర్వకారణం అని నిన్న మొన్న భారతీయులంతా చెప్పుకున్నారు. కావచ్చు కానీ... అసలు విషయం వేరే ఉంది. నిజానికి ఇలాంటి పులులు నాలుగు ఉండేవి. ఇప్పుడు ఒకటే ఉంది. అంటే... ఇది మనకు బాధాకరమైన విషయం. అరుదైన పులుల సంఖ్య తగ్గిపోతోంది అనేందుకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. ఈ స్ట్రాబెర్రీ టైగర్‌ను వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ మయురేష్ హెండ్రే క్లిక్ చేశాడు. ఈ పులులను కాజీ 106 F అని పిలిచేవాళ్లు. మొత్తం నాలుగు పులులను ఈ పార్కుకు తెచ్చారు. వాటి వివరాల్ని రాసి ఉంచారు. కానీ ఇప్పుడు ఒక్క పులి మాత్రమే ఉంది.

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్... ఈ ఆడ బంగారు పులి ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. పసుపు, బంగారు వర్ణంలో ఈ పులి మెరిసిపోతోంది. అక్కడక్కడా నల్ల చారలున్నాయి.కజిరంగాలో ఉండే పులులు... ప్రపంచంలోని మిగతా పులులకు భిన్నంగా ఉంటాయనీ, వాటిని అర్థం చేసుకోవడం, పరిశోధించడం సవాళ్లతో కూడుకున్న పని అంటున్నారు అధికారులు. వేర్వేరు జీన్స్ కలవడం వల్లే ఈ పులి బంగారం వర్ణంలో ఉందని చెబుతున్నారు. దేశంలో పులులు ఎన్ని ఉన్నా... అరుదైన వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలనీ, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పార్క్ అధికారులు కోరుతున్నారు.

ప్రస్తుతం కజిరంగా నేషనల్ పార్కులో 121 పులులు ఉన్నాయి. దేశంలో పులులు ఎక్కువగా ఉన్నది ఇక్కడే. చిన్న రాష్ట్రమైన అసోంలో... నాలుగు టైగర్ రిజర్వులు ఉండటం విశేషం. అవి కజిరంగా నేషనల్ పార్క్, ది మనాస్ నేషనల్ పార్క్, ఓరంగ్ నేషనల్ పార్క్, నమేరీ నేషనల్ పార్క్. 2006లో అసోంలో 70 పులులు మాత్రమే ఉండేవి. వాటి సంఖ్య ఇప్పటికి 250 శాతం పెరగడం విశేషం. ఇప్పుడున్న ఏకైక ఆడ బంగారు పులి... పిల్లలు కనే వయసులో ఉంది. అందువల్ల దానికి పుట్టే పిల్లలు ఏ రంగులో పుడతాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 9:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading