మహిళతో మరో మహిళ శృంగారం..ఇదేంటని కోర్టుకెక్కిన భర్త.. తీర్పు ఏం చెప్పారో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

తాను పిటిషనర్ భార్యతో శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన.. వారి దాంపత్య జీవితం దెబ్బతినలేదని చెప్పింది. కానీ ఈమె వాదనతో కోర్టు సంతృప్తి చెందలేదు. వారిద్దరి బంధాన్ని తప్పుబట్టింది.

  • Share this:
ఒక మహిళ మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకుంది. భర్త ఉన్నప్పటికీ.. అతడిని కాదని ఆమెతో సన్నిహితంగా మెలిగేది ఆ మహిళ. ఈ క్రమంలోనే ఆమె భర్త కోర్టు మెట్లెక్కాడు. ఆమె తన భార్యను లోబర్చుకుందని.. న్యాయం చేయాలని అభ్యర్థించాడు. ఈ స్వలింగ సంపర్కంపై ఒక జపాన్ కోర్టు ఊహించని తీర్పు ఇచ్చింది. తన భార్యతో సెక్సువల్ రిలేషన్‌లో ఉన్న ఒక మహిళపై దావా వేసిన భర్తకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. మహిళపై మోపిన ఆరోపణలను కోర్టు సమర్థించింది. పిటిషనర్ భార్యతో నిందితురాలు సెక్స్‌లో పాల్గొన్నందుకు.. అతడికి 1,100,00 యెన్ (భారతీయ కరెన్సీలో రూ.70,000) నష్టపరిహారం చెల్లించాలని ఆమెను టోక్యో డిస్ట్రిక్ కోర్టు ఆదేశించింది.

39 ఏళ్ల వ్యక్తి కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశాడు. తన భార్యతో మరో మహిళ లైంగిక సంబంధం పెట్టుకుందని అతడు ఆరోపించాడు. సదరు మహిళపై కేసు నమోదు చేయించాడు. ఆన్ లైన్ ద్వారా ఇద్దరు మహిళలు కలుసుకున్నారని కోర్టుకు తెలిపాడు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆ యువతి కోర్టులో బలంగా వాదించింది. తాను పిటిషనర్ భార్యతో శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన.. వారి దాంపత్య జీవితం దెబ్బతినలేదని చెప్పింది. కానీ ఈమె వాదనతో కోర్టు సంతృప్తి చెందలేదు. వారిద్దరి బంధాన్ని తప్పుబట్టింది. పిటిషనర్‌కు జరిమానా చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో 37 ఏళ్ల మహిళ, తాను సెక్సువల్ రిలేషన్‌లో ఉన్న మహిళ భర్తకు ఆ డబ్బు చెల్లించాల్సి వచ్చింది.


గతంలో కూడా టోక్యో కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. ఒక మహిళతో సహజీవనం చేసి, ఆమెను మోసం చేసిన మరో మహిళకు కోర్టు భారీ జరిమానా విధించింది. వీరిద్దరూ ఏడేళ్లు సహజీవనం చేశారు. అమెరికాలో పెళ్లి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చారు. రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళను మోసం చేసినందుకు 1.1 మిలియన్ యెన్‌ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి మరో మహిళను ఆదేశించారు. స్త్రీ, పురుషుల మధ్య ఉన్న సంబంధం, ఇద్దరు మహిళల సహజీవనం రెండింటికీ పెద్దగా తేడా లేదని జడ్జి తెలిపారు. ఈ రిలేషన్‌షిప్‌లో బాధితురాలిని సదరు మహిళ మోసం చేసిందని కోర్టు తీర్పు ఇచ్చింది.


గత వారం జపాన్ కోర్టు మరో చారిత్రక తీర్పు ఇచ్చింది. స్వలింగ వివాహాలను నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తీర్పు చెప్పింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్‌ను అనుమతించడానికి కొత్త చట్టం అవసరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు కొంత సమయం పట్టవచ్చని పేర్కొంది. ఈ తీర్పును 65 శాతం మంది ప్రజలు సమర్థిస్తున్నారని ఒక సర్వే తేల్చింది. స్వలింగ సంపర్కంపై జపాన్ ప్రజల ఆలోచనా ధోరణి మారుతోందని సర్వే విశ్లేషించింది.
Published by:Shiva Kumar Addula
First published: