• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • COUPLES IN MAHARASHTRA TOWN CHOOSING COVID CARE CENTRE VENUE FOR THEIR WEDDING AND ALSO DONATED A SIGNIFICANT AMOUNT OF MONEY GH SRD

Unique wedding: కోవిడ్ కేర్ సెంటర్లో పెళ్లి...ఇలా ఎందుకు చేశారో తెలిస్తే శభాష్ అంటారు..

Unique wedding: కోవిడ్ కేర్ సెంటర్లో పెళ్లి...ఇలా ఎందుకు చేశారో తెలిస్తే శభాష్ అంటారు..

Unique wedding: కోవిడ్ కేర్ సెంటర్లో పెళ్లి... ఇలా ఎందుకు చేశారో తెలిస్తే శభాష్ అంటారు..

Unique wedding: కరోనా ఎఫెక్ట్ తో దేశమంతా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. ఈ మహమ్మారి ప్రభావం చాలా రంగాలపై పడింది. పెళ్లిళ్లు కూడా కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డాయ్. అయితే, కరోనా తరువాత కూడా, చాలామంది పెద్దగా ఆర్బాటాలు లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా కొత్త పద్ధతిలో పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచిందో ఓ జంట.

  • Share this:
కరోనా కారణంగా వివిధ రకాల వేడుకలు వాయిదా పడ్డాయి. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినప్పటికీ, కొన్ని పరిమితులు విధించాయి. అయితే కరోనా తరువాత కూడా, చాలామంది పెద్దగా ఆర్బాటాలు లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా కొత్త పద్ధతిలో పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు యువకులు. కోవిడ్ కేర్ సెంటర్లలో వివాహం చేసుకొని, పెళ్లికి ఖర్చు చేయకుండా మిగిల్చిన డబ్బును అదే కోవిడ్ కేర్ సెంటర్లకు విరాళంగా అందించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న పార్నర్ పట్టణంలో ఈ ప్రత్యేక వివాహ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో, అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. ఇటీవల అహ్మద్ నగర్ జిల్లాలో వివాహ వేడుకలకు సంబంధించిన అన్ని ఆంక్షలను అధికారులు సడలించారు. దీంతో పార్నర్ పట్టణానికి చెందిన రెండు జంటలు కోవిడ్ సెంటర్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లికి అయ్యే అనవసర ఖర్చులను తగ్గిస్తూ, ఆ డబ్బును వీరు కోవిడ్ సెంటర్‌కు విరాళంగా అందించారు. స్థానిక ఎమ్మెల్యే నీలేష్ లంకకు చెందిన శరద్ చంద్రజీ పవార్ ఆరోగ మందిర్ కోవిడ్ సెంటర్‌లో ఈ జంట వివాహం చేసుకున్నారు. అనికేత్ వ్యవహరే, ఆర్తి షిండేతో పాటు రాజశ్రీ కాలే, జనార్దన్ కాదం దంపతులు ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ఖర్చు చేయకుండా మిగిల్చిన డబ్బుతో.. మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, అవసరమైన ఇతర మందులను కొనుగోలు చేసి, ఈ కేంద్రానికి ఇచ్చారు. దీంతో పాటు రూ.37000 ఆర్థిక సహాయం కూడా అందించారు.

ఈ వినూత్నమైన ఆలోచన వెనుక ఉద్దేశాన్ని వివరించారు అనికేత్. ‘కరోనా కారణంగా ప్రపంచం మొత్తం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడానికి కొన్ని ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఎంతోమంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ధైర్యాన్ని నింపడంతో పాటు, కేంద్రానికి సాయం చేయాలనుకున్నాం. అందువల్ల పెద్దగా ఖర్చు చేయకుండా, హడావుడి లేకుండా ఇలా పెళ్లి చేసుకున్నాం’ అని వివరించారు.

కరోనా నిబంధనలను అనుసరించి ఈ వేడుక జరిగింది. నవ దంపతుల తల్లిదండ్రులు, కొందరు బంధువులు, ఎమ్మెల్యే నీలేష్ లంకే మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రోగుల్లో భయాన్ని పోగొట్టడానికి ఉన్నత విద్యావంతులైన ఈ యువకులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తల్లిదండ్రుల అనుమతితో, కోవిడ్ కేర్ సెంటర్లో యువ జంటలు పెళ్లి చేసుకోవడం మంచి విషయమని చెప్పారు.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు