Home /News /trending /

COUPLE WHO GOT MARRIED AGAIN AFTER TEN YEARS OF DIFFERENT MARRIAGES IN BIHAR SNR

OMG: వీళ్లేం ప్రేమికులు..అదేం పెళ్లి..వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు

(వింత ప్రేమజంట)

(వింత ప్రేమజంట)

OMG:పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న ఓ యువతి, యువకుడు మరోసారి తమ పాత ప్రేమను గుర్తు చేసుకున్నారు. పదేళ్ల క్రితం విడిపోయిన ఇద్దరూ ప్రేమికులు ఫ్యామిలీలను వదిలి మరోసారి లవ్ మ్యారేజ్ చేసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

వాళ్లది ప్రేమో, పిచ్చో , లేక పిచ్చి ప్రేమో అర్ధం కాక ఊరి జనాలే జుట్టు పీక్కున్నారు. ఎవరైనా ప్రేమించుకుంటే పెళ్లి చేసుకుంటారు. పెద్దలు ఒప్పుకోకపేతే పారిపోయో లేదంటే లేచిపోయో పెళ్లి చేసుకుంటారు. ఇవేమి కాకుండా బిహార్‌(Bihar)లో ఓ ప్రేమజంట పదేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడం కుదరకపోవడంతో వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇద్దరూ ఎవరికి వారే ముగ్గురేసి పిల్లల్ని కన్నారు. అంతా బాగానే ఉంది. పదేళ్ల తర్వాత మళ్లీ వాళ్లిద్దరికి ప్రేమ గుర్తుకు వచ్చింది. అంతే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎవరేమనుకుంటే మాకేంటని ఇద్దరూ ఎవరికి వాళ్లు ఇంట్లో చెప్పకుండా వచ్చి గ్రామస్తుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ వెరైటీ వెడ్డింగ్‌కి సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఖగారియా ( Khagaria)కు చెందిన సోనీదేవి(SoniDevi)టెలోచ్(Teloch)గ్రామానికి సుమిత్‌ (Sumit‌h)అనే వ్యక్తిని ప్రేమించింది. ప్రేమించుకున్న సమయంలో పెళ్లి చేసుకోలేకపోయారు. ఫలితంగా సోనీదేవికి మర్(Mar)గ్రామానికి చెందిన బబ్లూ(Bablu)తో పదేళ్లక్రితం వివాహం జరిగింది. ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. సోనీదేవి ప్రేమించిన సుమిత్‌కి కూడా వేరే యువతితో పెళ్లి జరిగింది. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎవరి జీవితాలు వాళ్లు గడుపుతున్న సమయంలో షడన్‌గా వీళ్లిద్దరి మధ్యలో మళ్లీ ప్రేమ పుట్టుకొచ్చింది. న ఈప్రేమజంట పదేళ్ల తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుందామనే ఐడియా వచ్చింది. అంతే సోనీదేవి సుమిత్‌ని తీసుకొని గుడిలో పెళ్లి చేసుకుంది. వీళ్ల ప్రేమ పెళ్లి వ్యవహారం చూస్తుంటే ఎలా ఉందంటే ప్రేమ హద్దులు దాటితే సమాజం, బంధువుల్ని లెక్కయవనే డైలాగ్‌ని గుర్తు చేసింది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ ప్రేమికులిద్దరూ గతంలో పెళ్లైన వాళ్లే కావడంతో సమాజం నిలదీసింది.

బిహార్‌లో పిచ్చి ప్రేమజంట..
సోనీదేవి తన మెట్టినింట్లో ఉన్న నగలు, డబ్బు తీసుకొని ప్రియుడు సుమిత్‌కి పెళ్లి చేసుకుందాం రా అని కబురు పంపింది. అది తెలిసిన వెంటనే సుమిత్‌ వచ్చి గుడిలో ఆమె నుదిటన తిలకం దిద్ది గ్రామస్తులందరూ చూస్తుండగానే పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా జరగక ముందు రహస్యంగా కలుసుకున్న వీళ్లను గ్రామస్తులు పట్టుకొని ఊరి పెద్దల మధ్య పంచాయితీ పెట్టారు. అక్కడ కూడా సోనీదేవిని తన భార్యగా స్వీకరిస్తున్నానని..తనకు ఆమె ఇష్టమని సుమిత్ చెప్పడం...సోనీదేవి కూడా సుమిత్‌ కోసం తాను చావడానికైనా సిద్ధమేనని చెప్పారు. ఇద్దరి ఇష్టం కావడంతో గుడిలో పెళ్లి చేసుకొని వెళ్లిపోయారు.

పెళ్లైన తర్వాత రెండో పెళ్లి ..
అత్తగారి ఇంటి నుంచి డబ్బు, నగలు తీసుకొచ్చిన సోనీదేవిని ప్రియుడితో వెళ్లడం ఇష్టమేనా అని అడిగిన ఊరి పెద్దలు పిల్లల్ని ఎవరు చూస్తారు. మీ భర్తతో విడాకులు తీసుకోకుకండా వేరే వెళ్లి చేసుకోవడం తప్పని కూడా చెప్పకుండా పెద్ద డ్రామా నడిపించారు. పదేళ్ల తర్వాత జరిగిన సోనీదేవి, సుమిత్‌ల పెళ్లికి ఇలాగే పెద్దలు ఏదో కట్టుబాట్ల పేరుతో విడదీస్తారని తెలిసి ముందుగానే ఇద్దరూ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి తమకు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం...ఇద్దరిలో ఒకర్ని వదిలి మరొకరు ఉండలేమని చెప్పి వెళ్లిపోయారు. పదేళ్ల తర్వాత కలుసుకున్న సోనిదేవి, సుమిత్‌ ప్రేమ వ్యవహారం చూసిన గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ప్రేమజంట అక్కడైనా పవిత్రంగా ఉంటుందా లేక మధ్యలోనే వీగిపోతుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bihar News, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు