పెళ్లి వేడుకకు హాజరుకాని అతిథికి షాక్.. రూ. 17,700 చెల్లించాలని బిల్లు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా ఏదైనా ఫంక్షన్లకు, పార్టీలకు అతిథులను ఆహ్వానిస్తుంటారు. అతిథిగా వచ్చేవారికి మర్యాదలు చేస్తారు. వారికి మంచి అతిథ్యం అందజేయాలని చూస్తుంటారు.

 • Share this:
  సాధారణంగా ఏదైనా ఫంక్షన్లకు, పార్టీలకు అతిథులను ఆహ్వానిస్తుంటారు. అతిథిగా వచ్చేవారికి మర్యాదలు చేస్తారు. వారికి మంచి అతిథ్యం అందజేయాలని చూస్తుంటారు. అయితే పిలిచిన అతిథులు(Guests).. రాకపోతే వారిపైన అలగడం, మాట్లాడకపోవడం వంటివి చేస్తుంటారు కొందరు. కానీ ఓ కొత్త జంట(Newly Married Couple) మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. తమ పెళ్లికి హాజరుకాని వ్యక్తికి 240 డాలర్ల(రూ. 17,700) మొత్తం చెల్లించాలని బిల్లు పంపింది. తమ పెళ్లి రిసెప్షన్‌కు హాజరు కానందున ఈ మొత్తం చెల్లించాలని చెప్పింది. ఈ బిల్లు కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బయట హోటల్స్, షోరూమ్స్, మాల్స్.. ఇచ్చే ఇన్‌వాయిస్‌ను(invoice) పోలి ఉంది. .

  పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట తమ రిసెప్షన్‌కు రావాల్సిందిగా ఒక వ్యక్తిని పిలిచినట్టుగా తెలుస్తోంది. అందుకు వాళ్లు తప్పక హాజరవుతానని చెప్పారు. అందులోనూ జంటగా వ‌స్తామ‌ని మాటివ్వ‌డంతో.. ఇద్ద‌రి కోసం రిసెప్షన్‌లో రెండు సీట్ల‌ను రిజ‌ర్వ్ చేయించారు. ఇందుకుగాను ఒక్కో సీటుకు 120 డాల‌ర్ల చొప్పున‌.. 240 డాల‌ర్ల‌ను ఖర్చు పెట్టింది. అయితే చివరకు అక్కడికి మిగిలిన అందరూ అతిథులు చేరుకోగా.. ఈ ఇద్దరు మాత్రం మిస్ అయ్యారు. అయితే వారు హాజరు కావడం లేదని ఎలాంటి కాల్స్ చేయడం కానీ, ముందస్తు సమాచారం ఇవ్వడం కానీ జరగలేదని.. అందుకే ఈ సీట్స్‌కు చెల్లించిన మొత్తం వాళ్లు తమకు రుణపడి ఉన్నారని ఇన్‌వాయిస్‌లో పేర్కొన్నారు. రిజ‌ర్వ్ చేసిన సీట్లకు అయిన ఖర్చు చెల్లించాలని కోరారు.

  హాయిగా సాగిపోతున్న సంసారం.. ఆరేళ్ల కూతురిని విడిచి పెట్టి ఈ తల్లి ఏం చేసిందంటే..

  Zelle or PayPal ద్వారా డబ్బులు చెల్లించవచ్చని తెలిపారు. ఏ పద్దతిలో చెల్లిస్తున్నారో తెలుపాలని పేర్కొన్నారు. ఇక, ఆ బిల్లుకు "No Call, No Show Guest" అనే టైటిల్ ఉంచింది. ఆగస్టు 18 న జారీ చేసిన ఇన్‌వాయిస్‌కు '0000001' నంబర్ చేయబడింది. బిల్లు చెల్లించేందుకు నెల రోజుల గడువు ఇస్తున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్ 18లోగా బిల్లు చెల్లించాలని ఇన్‌వాయిస్‌లో పొందుపరిచారు.

  ప్రస్తుతం ఈ బిల్లు కాపీ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. చాలా మంది ఈ బిల్లును తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలా చేయడం ఏమిటని మండిపడుతున్నారు. కొందరు మాత్రం ఈ బిల్లుపై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్‌వాయిస్‌ను ఇంతకు మందు ఎప్పుడు చూడలేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక, Huffington Postకు చెందిన ఫిలిప్ లూయిస్ (philip lewis) కూడా ఈ బిల్లును ట్విట్టర్‌లో షేర్ చేశారు.
  Published by:Sumanth Kanukula
  First published: