బీహార్(Bihar)లో ఓ ప్రేమజంట కోర్టులో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఐదేళ్లుగా ప్రేమించుకున్న ప్రేమికులు వివాహం చేసుకుందామనుకున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి ఏకంగా కోర్టు(Court)లో ఒక్కటయ్యారు. యువతి, యువకుడు మేజర్లు (Majors)కావడంతో కోర్టు కూడా వారి ప్రేమ వివాహానికి పచ్చ జెండా ఊపింది. ప్రేమికుల నుంచి భార్యభర్తలుగా మారిన ప్రేమజంట ఇద్దరూ తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఓ వీడియో(Video)ని సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో విస్తృతంగా వైరల్(Viral) అవుతోంది. మేం ప్రేమను గెలిచాం..పెద్దల్ని ఎదిరించి ఒక్కటయ్యామని చెబుతున్న వీడియో చూసి నెటిజన్లు కొందరు మద్దతు తెలుపుతుంటే మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఒక్కటైన ప్రేమికులు..
బీహార్‌లోని ముంగేర్‌లోని చండీస్థాన్ ప్రాంతానికి చెందిన పాండవ్ నేహా అనే యువతి ప్రేమించుకున్నారు. ఐదేళ్లుగా ఇద్దరూ ఒకరికి ఒకరిపై మరొకరికి విడదీయలేనంతగా ఇష్టం పెరగడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పాండవ్, నేహ పెళ్లి చేయడం ఇష్టం లేని యువతి బంధువులు యువతిని వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని ప్లాన్ చేశారు. విషయం తెలుసుకున్న ప్రేమజంట ఇంటి నుంచి పారిపోయారు. జముయి కోర్టును ఆశ్రయించి తాము ఇద్దరం ఇష్టపడ్డామని..మేజర్లమని పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో ఇద్దరికి న్యాయస్థానంలోనే వివాహం జరిపించారు. అటుపై ప్రేమజంట దగ్గరలోని గుడికి వెళ్లి దండలు మార్చుకొని దేవుని ఆశీస్సులు తీసుకున్నారు.
పెద్దల్ని ఎదిరించి కోర్టులో పెళ్లి..
ప్రేమ పేరుతో పాండవ్, నేహాలు ఒక్కటయ్యారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు పాండవ్ తమ బిడ్డను కిడ్నాప్ చేసాడని కేసు పెట్టారు. ఈవిషయంపైనే ప్రేమికులు ఇద్దరూ ఓ వీడియోని మెసేజ్‌ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేహాను కిడ్నాప్ చేయలేదని..ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని...పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడం వల్లే ఇంటి నుంచి పారిపోయి వచ్చి కోర్టు అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నామని చెప్పారు.
వైరల్ అవుతున్న వీడియో..
అంతే కాదు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరూ సంతోషంగా ఉన్నామని..ఇప్పుడు పెద్దలు ఇంటికి రమ్మని పిలుస్తున్నారని చెప్పారు. తమకు యువతి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఏమైనా చేస్తారనే భయం ఉందని..దయచేసి పోలీసులు తమ రక్షణ కల్పించాలని వీడియో ద్వారా వేడుకున్నారు. కోర్టు అనుమతితో ఒక్కటైన తర్వాత కూడా తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ ప్రేమజంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Love marriage, Viral Video