పక్కన కనిపిస్తున్న ఫొటోను ఓ సారి పరిశీలనగా చూడండి. కాళ్లకు చెట్ల తీగలు, వారి చుట్టూ చెత్తా చెదారం. సముద్రం ఒడ్డున నిశ్చలంగా పడి ఉన్న జంట. ఇద్దరి నడుములకు కలిసి కట్టిన ఒకేతాడు. ఈ సీన్ ను చూస్తే మొదటగా మీకు ఏం అనిపిస్తుంది. ఎవరో ప్రేమ జంట ఇద్దరూ కలిసి నడుముకు తాడు కట్టుకుని మరీ ఆత్మహత్య చేసుకున్నారనుకుంటారు కదా. చనిపోయిన తర్వాత వారి మృతదేహాలు ఒడ్డుకు తరలి వచ్చాయేమోనని భావిస్తారు కదా. ఈ ఫొటోను చూస్తే అందరికీ అదే భావన కలుగుతుంది. కానీ అది ఏమాత్రం నిజం కాదు. వాళ్లేమీ ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట అసలే కాదు. కాబోయే భార్యాభర్తలు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. మరెందుకు ఇలా సముద్రం ఒడ్డున పడిఉన్నారనే కదా మీ డౌటు. అయితే కింద కనిపిస్తున్న వీడియోను ఓ లుక్కేయండి.
పైన కనిపిస్తున్న వీడియోను చూశారు కదా. ఇది పెళ్లికి ముందు ఆ జంట కలిసి తీయించుకున్న వీడియో. దీన్ని చూస్తేనే అర్థమయిపోతుంది ఇదో ప్రీ వెడ్డింగ్ షూట్ అని. పెళ్లికి ముందు ఆ జంట తీసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఇదో భాగం మాత్రమే. శుభమానూ పెళ్లి చేసుకోబోతూ ఇలా అశుభాన్ని చిత్రీకరిస్తారేంటని చాలా మంది అనుకున్నా, అది వారి ఇష్టానికే వదిలేయొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
ఈ వీడియో కింద కామెంట్లయితే మామూలుగా లేవండోయ్. పైత్యం పెరిగిపోయిందనీ, పిచ్చి పీక్స్ కు వెళ్లిపోయిందనీ ఎన్నెన్ని కామెంట్లు పెడుతున్నారో నెటిజన్లు. వారిలో మరికొందరు మాత్రం ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం, మీదేం పోతోంది అని వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు కూడా. గతంలో జరిగిన ప్రీవెడ్డింగ్ షూట్ లలో ఇలాంటి ఎన్నెన్నో విచిత్రాలు జరిగాయి. నగ్నంగా ఉన్నట్టుగా కనిపించేలా తోటల్లో తిరిగిన జంటను చూసి ఉంటారు. జుగుప్పాకరమైన భంగిమల్లో ప్రీవెడ్డింగ్ షూట్ ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. మన సంస్కృతి ఏమైపోతోందో అని మధనపడే వాళ్లు ఉన్నట్టే, ఇప్పుడు ఇదే ట్రెండ్ అంటూ సమర్ధించేవాళ్లు కూడా లేకపోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending, Trending videos, VIRAL NEWS, Viral Videos, Wedding