హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

టిక్కెట్ అడిగారని..పిల్లోడిని ఎయిర్ పోర్ట్ లోనే వదిలేసి విమానం ఎక్కిన దంపతులు

టిక్కెట్ అడిగారని..పిల్లోడిని ఎయిర్ పోర్ట్ లోనే వదిలేసి విమానం ఎక్కిన దంపతులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తల్లిదండ్రులకు పిల్లలు అత్యంత ప్రియమైనవారు. అయితే ఓ బెల్జియం జంట తమ బిడ్డతో చేసిన పని ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ జంట ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ నుండి బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వెళ్లాల్సి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Parents leaves baby at airport : తల్లిదండ్రులకు పిల్లలు అత్యంత ప్రియమైనవారు. అయితే ఓ బెల్జియం జంట(Belgium couple) తమ బిడ్డతో చేసిన పని ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ జంట ఇజ్రాయెల్(Israel) లోని టెల్ అవీవ్ నుండి బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వెళ్లాల్సి వచ్చింది. దీంతో తమ బిడ్డతో కలిసి ఎయిర్ పొర్ట్ కి వచ్చారు. అయితే అక్కడ చిన్నారికి టిక్కెట్టు అడగ్గా టిక్కెట్టు లేదు. చివరికి, వారు పిల్లవాడిని చెక్-ఇన్ కౌంటర్ వద్ద వదిలివేసి విమానం ఎక్కారు. ఇది చూసి అక్కడున్న ఉద్యోగులు చలించిపోయారు.

జెరూసలేం పోస్ట్ ప్రకారం...ఈ జంట బ్రస్సెల్స్‌కు వెళ్లేందుకు టెల్ అవీవ్‌లోని బెన్-గురియన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే వారు తమ పిల్లోడికి టిక్కెట్ తీసుకోలేదు. దీంతో ర్యాన్‌ఎయిర్ సిబ్బంది.. మీరు కొంత డబ్బు చెల్లించి టికెట్ తీసుకోండి అని ఆ దంసతులకు చెప్పారు. అయితే దీనికి ఆ జంట అంగీకరించలేదు. టిక్కెట్టు తీసుకునేందుకు కూడా నిరాకరించారు. చిన్నారికి వసతి కల్పించేందుకు ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిరాకరించడంతో దంపతులు చిన్నారిని అక్కడే వదిలేసి విమానం లోపలికి వెళ్లిపోయారు. ఈ వైఖరిని చూసిన విమానాశ్రయ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇది వింతగా భావించి చివరకు పోలీసులకు సమాచారం అందించారు. కొంతకాలం తర్వాత, పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా గుర్తించి, వారిని బ్రస్సెల్స్‌కు వెళ్లనివ్వలేదు. ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ చిన్నారిని వదిలేసి వెళ్లిపోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Yanomani tribe : వీరి సంప్రదాయాలే వేరు..శవాన్ని దహనం చేసిన తర్వాత మిగిలే భస్మంతో చారు

ఉద్యోగులు షాక్‌

ఇది చూసి అందరూ అవాక్కయ్యారని చెక్ ఇన్ కౌంటర్ వద్ద ఉన్న ర్యాన్ ఎయిర్ డెస్క్ మేనేజర్ తెలిపారు. మేము ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. మేము చూసినదాన్ని మేము నమ్మలేకపోయాము. ఆ చిన్నారిని మా వద్దే ఉంచుకుని పోలీసులకు సమాచారం అందించాం. స్మగ్లింగ్‌ చేసి బిడ్డను తీసుకెళ్లి ఉండరేమో అనుకున్నాం. అయితే ఆ చిన్నారి ఇద్దరిదీ అని తర్వాత తెలిసింది. పోలీసులు ఇద్దరినీ ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Israel

ఉత్తమ కథలు