Home /News /trending /

COUPLE FROM TAMIL NADU IS PLANNING TO HOLD THEIR WEDDING RECEPTION IN THE METAVERSE GH VB

Metaverse: మెటావర్స్‌లో వెడ్డింగ్ రిసెప్షన్.. ఇండియాలో మొదటిసారి ప్లాన్ చేసిన తమిళనాడు జంట..

మెటావర్స్ లో పెళ్లి చేసుకోబోతున్న జంట

మెటావర్స్ లో పెళ్లి చేసుకోబోతున్న జంట

ఫ్యూచర్ ఇంటర్నెట్‌గా పిలుస్తున్న మెటావర్స్‌ (Metaverse)లో ఓ ప్రపంచాన్నే సృష్టించవచ్చు. ఈ ప్రపంచంలోకి డిజిటల్ పద్ధతిలో యూజర్లు ప్రవేశించి ఒకరు ఒకరితో సంభాషించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే టచ్ చేయలేని రియల్ వరల్డ్‌నే మెటావర్స్‌ అంటారు. అయితే ఇలాంటి వరల్డ్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ (wedding reception) ఏర్పాటు చేయడానికి ఓ తమిళనాడు జంట సిద్ధమయ్యింది.

ఇంకా చదవండి ...
ఫ్యూచర్ ఇంటర్నెట్‌గా(Future Internet) పిలుస్తున్న మెటావర్స్‌ (Metaverse)లో ఓ ప్రపంచాన్నే సృష్టించవచ్చు. ఈ ప్రపంచంలోకి డిజిటల్ పద్ధతిలో యూజర్లు ప్రవేశించి ఒకరు ఒకరితో సంభాషించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే టచ్ చేయలేని రియల్ వరల్డ్‌నే మెటావర్స్‌ అంటారు. అయితే ఇలాంటి వరల్డ్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ (wedding reception) ఏర్పాటు చేయడానికి ఓ తమిళనాడు జంట సిద్ధమయ్యింది. మెటావర్స్‌లో పెళ్లి రిసెప్షన్ నిర్వహించడం భారత్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. కాబోయే భార్యాభర్తలైన (would-be spouses) దినేష్ ఎస్‌పీ, జనగనందిని అనే జంట ఫిబ్రవరి 6న పెళ్లి చేసుకోనున్నారు. అయితే వీరిద్దరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బంధుమిత్రులను మెటావర్స్‌లో నిర్వహించే పెళ్లి రిసెప్షన్‌కు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే దినేష్ ట్విట్టర్ వేదికగా మెటావర్స్ రిసెప్షన్‌కు సంబంధించిన ఇన్విటేషన్ షేర్ చేశాడు. వీడియో రూపంలో ఉన్న ఈ మెటావర్స్ ఇన్విటేషన్ సోషల్ మీడియాని కుదిపేస్తోంది.

Amazon Great Republic Day Sale 2022: వాటిపై భారీ డిస్కౌంట్.. రూ. 2,799 ధరకే ఆ ప్రొడక్ట్ సొంతం..


వివరాల్లోకి వెళితే... దినేష్ ఎస్‌పీ అనే యువకుడు ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం దినేష్.. జనగనందిని అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మొన్నటిదాకా ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలేక్కేందుకు సిద్ధమమైంది. ఫిబ్రవరి ఆరో తేదీన శివలింగపురం గ్రామంలో ఎస్‌పీ దినేష్, జనగనందిని పెళ్లి జరగనుంది. అదే రోజున సాయంత్రం రిసెప్షన్‌ జరగనుంది. అయితే ఈ రిసెప్షన్‌ మిగతా వాటిలా కాకుండా పూర్తి భిన్నంగా జరగబోతోంది.

ఇందులో వధూవరులు డెకరేటెడ్ కారులో నుంచి దిగడానికి బదులుగా తమ ల్యాప్‌టాప్‌లను ఆన్ చేసి తమ 3డీ అవతార్‌లతో హ్యారీపాటర్ యూనివర్స్‌లోని హాగ్వార్ట్స్ కోటలోని డైనింగ్ రూమ్ లోకి విచ్చేస్తారు. ఇదే వర్చువల్ లొకేషన్‌కు ఒక లింకు ద్వారా బంధుమిత్రులంతా హాజరవుతారు. ప్రపంచ నలుమూలల నుంచి లాగిన్ అయిన ప్రియమైన వారిని వధూవరులు ఆహ్వానిస్తారు. జనగనందిని తండ్రి మరణించగా.. అతని ప్రెజెన్స్ ఉండేలా ఓ అవతార్ క్రియేట్ చేయించారు. ఈ అవతార్ పెళ్లి రిసెప్షన్ పెద్దగా వ్యవహరించనుంది.

దినేష్ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీలో పనిచేస్తున్నాడు. అయితే మెటావర్స్‌కు బ్లాక్‌చెయిన్‌నే ఫౌండేషన్ టెక్నాలజీ కావడంతో అదే పద్ధతిలో పెళ్లి రిసెప్షన్ నిర్వహించాలనే తన కోరికను వధువుకు దినేష్ తెలియజేశాడు. ఈ ఆలోచన ఆమెకు బాగా నచ్చడంతో సంతోషంగా ఓకే చెప్పేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కలుసుకుని మెటావర్స్‌లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించడం చాలా విచిత్రంగా అనిపిస్తోందని ఆమె అన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రియల్ వెడ్డింగ్ రిసెప్షన్ కాకుండా ఇలా వర్చువల్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించడం వల్ల ఎవరికీ ఎలాంటి రిస్క్ ఉండదని చెప్పవచ్చు.

Zodiac Signs-Luxury: లగ్జరీ అంటే వీరికి ప్రాణం.. ఆ 5 రాశులవారు వీళ్లే.. మీరున్నారేమో చూసుకోండి..


మెటావ‌ర్స్‌ అనేది ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR), బ్లాక్ చైయిన్ టెక్నాలజీ సహాయంతో ఒక డిజిటల్ వాతావరణం సృష్టిస్తుంది. మెటావ‌ర్స్‌ రిసెప్షన్ సమయంలో వధూవరుల అవతార్‌లు సాంప్రదాయ భారతీయ వస్త్రధారణలో ఉంటాయి. ఒక గంట పాటు సాగే ఈ రిసెప్షన్ సమయంలో బంధుమిత్రులందరికీ లాగిన్ అవ్వడానికి ఓ లింక్ ఇస్తారు. ఇక్కడ భారతీయ, పాశ్చాత్య బట్టల అవతార్‌లు కనిపిస్తాయి. అతిథులు వాటిలో తమకు నచ్చిన దుస్తుల అవతార్‌ను ఎంచుకుంటారు. గూగుల్ పే లేదా క్రిప్టో కరెన్సీలో కొత్తజంటకు చదివింపులు కూడా చదివించడం సాధ్యమవుతుంది.

ఈ రిసెప్షన్ కోసం వెబ్, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యం కలిగిన క్వాటిక్స్ టెక్‌కి చెందిన విఘ్నేష్ సెల్వరాజ్‌ను దినేష్ సంప్రదించారు. దినేష్, జనగనందిని ఇద్దరూ హ్యారీ పాటర్ లవర్స్ కాబట్టి రిసెప్షన్‌ను హ్యారీ పాటర్ తరహాలో చేయాలని కోరుకున్నారు. కాగా, గతేడాది డిసెంబర్‌లో యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన ట్రాసీ, డేవ్ గాగ్నోన్ అనే జంట మెటావర్స్‌లో ఏకంగా వివాహమే చేసుకుని వార్తల్లో నిలిచారు.
Published by:Veera Babu
First published:

Tags: Metaverse, Tamilanadu, Trending news, Trending videos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు