Home /News /trending /

COUPLE FALLS INTO WATERLOGGED DITCH IN UTTAR PRADESH ALIGARH AS THEIR SCOOTY SUBMERGES VIDEO GOES VIRAL PAH

మ్యాన్ హోల్ లో పడిన పోలీసు అధికారి దంపతులు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో...

మ్యాన్ హోల్ లో పడిన దంపతులు

మ్యాన్ హోల్ లో పడిన దంపతులు

Uttar pradesh: భార్య భర్తలు తమ వెహికిల్ లో రోడ్డుపై వెళ్తున్నారు. ఇంతలో అక్కడ భారీ వర్షం కురిసింది. రోడ్డంతా నీళ్లతో నిండిపోయింది.

వర్షాకాలం (Heavy rains) ప్రారంభమయ్యింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పటికే మ్యాన్ హోళ్లలతో (Man holes) నీళ్లు నిండిపోయి అనేక ప్రమాదాలు జరిగాయి. అదే విధంగా.. కొన్ని చోట్ల వర్షంతో వెహికిల్స్ జారటం వంటి సంఘటనలు జరిగాయి. ఇప్పటికే అనేక ప్రదేశాలు వర్షంతో నాలాలు పొంగిపోర్లుతుంటాయి. రోడ్లపై గుంతలు ఎక్కడ ఉన్నాయో కూడా సరిగ్గా తెలియవు. దీంతో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పటికే గుంతల కారణంగా అనేక ప్రమాదాలు జరిగిన సంఘటనలు వార్తలలో నిలిచాయి. ప్రస్తుతం ఒక పోలీసు అధికారి నాలాలో పడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  షాకింగ్ ఘటన జరిగింది. అలీఘడ్ జిల్లాలోని కిషన్ పూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దయానంద్ సింగ్ అత్రి, భార్య అంజుతో కలిసి స్కూటీపైన వెళ్తున్నారు. ఇంతలో వర్షం రావడంతో కాసేపు ఆగారు. ఆ తర్వాత.. తిరిగి తమ ఇంటికి వెళ్తున్నారు. అప్పుడు ఒక షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపైన మ్యాన్ హోల్ గుంత ఉంది. అది నీటితో నిండిపోయింది.


దీన్ని దయానంద్ సింగ్ అత్రి గమనించలేదు. తన స్కూటీని పొనిచ్చాడు. వెంటనే భార్యభర్తలు, స్కూటీతో సహా మ్యాన్ హోల్ లో పడిపోయారు. అప్పుడు వెంటనే పాదచారులు, స్థానికులు చాకచక్యంగా వ్యవహరించారు. వెంటనే దంపతులను మ్యాన్ హోల్ నుంచి బయటకు తీశారు. పెద్ద ప్రమాదం తప్పడంతో భార్యభర్తలు ఊపిరిపీల్చుకున్నారు. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి గాయాలు కాకుండానే ప్రాణాలతో బయటపడ్డారు. బైక్ మాత్రం మ్యాన్ హోల్ లోనే ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో (Social media) పోస్టు చేయడంతో ఇప్పుడది వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వామ్మో.. పెద్ద ప్రమాదమే తప్పిందని కామెంట్ లు పెడుతున్నారు.



ఇదిలా ఉండగా ఒక ట్రాఫిక్ పోలీసు హైవే (Traffic constable) మీద కూడలి వద్ద చీపురు పట్టుకుని రోడ్డును శుభ్రం చేశాడు.

కూడలి వద్ద రోడ్డు డ్యామేజ్ అయ్యింది. కంకర పైకి తేలింది. ఇసుక కూడా పైకి తెలింది. దీంతో కొన్ని సార్లు.. ప్రయాణికులు అదుపుతప్పి పడిపోయే ఛాన్స్ ఉంది. దీన్ని గమనించిననన ట్రాఫిక్ కానిస్టేబుల్ తానే రంగంలోనికి దిగాడు. చీపురు పట్టుకుని రోడ్డుపైన తెలిన కంకరను, ఇసుకను శుభ్రం చేశాడు. (Traffic Cop Sweeps Busy Road) రోడ్డుపైన ప్రయాణికులు ఉన్న ట్రాఫిక్ అధికారి ఏమాత్రం మోహమాట పడలేదు.

కేవలం ప్రజలకు ఇబ్బంది కలగ కూడదనే మాత్రమే ఆలోచించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియోను (Viral video) ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media)  తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ప్రయాణికుల భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరీకొందరు మీ గొప్ప తననానికి మా సెల్యూట్ సర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Heavy Rains, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు