Home /News /trending /

లాక్‌డౌన్‌లో రోడ్డు పక్కన కారు.. శృంగారంలో మునిగి తేలిన జంట.. అటుగా వచ్చిన పోలీసులు చూసి...

లాక్‌డౌన్‌లో రోడ్డు పక్కన కారు.. శృంగారంలో మునిగి తేలిన జంట.. అటుగా వచ్చిన పోలీసులు చూసి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతున్నాయి. అందరూ ఇంటికే పరిమితం కావాల్సి ఉండగా.. ఓ జంట కారులో శృంగారంలో పాల్గొంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.

శృంగారమనేది చాలా వ్యక్తిగతమైన విషయం. అందులోనూ దంపతుల మధ్య గోప్యంగా నాలుగు గోడల మధ్య జరిగాల్సిన కార్యం. స్వేచ్ఛ ఇచ్చారు కదాని ఎక్కడ పడితే అక్కడ పాల్గొంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందులోనూ కరోనా వల్ల లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతున్న ప్రదేశంలో అయితే శిక్ష ఇంకా ఎక్కువగా ఉంటుంది. కారులో సెక్స్ చేసుకుంటుండగా అడ్డంగా దొరికి భారీ మూల్యం చెల్లించుకుంది ఓ జంట. వందల డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది.

యూకేలోని డెర్బీషైర్లో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతున్నాయి. అందరూ ఇంటికే పరిమితం కావాల్సి ఉండగా.. ఓ జంట కారులో శృంగారంలో పాల్గొంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. రోడ్డుకు పక్కన కారు ఆపి తమ లైంగిక వాంఛ తీసుకుంటున్న వీరిద్దరికి ఆటంకం కలిగించి అదుపులో తీసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా జరిమానా విధించారు. వందో, రెండోందలో అనుకుంటే పొరపాటే ఏకంగా ఇద్దరికి చెరో 200 పౌండ్లు చొప్పున 400 పౌండ్లు ఫైన్ వేశారు. భారత కరెన్సీ ప్రకారం దాదాపు 40 వేల రూపాయలు చెల్లించింది ఈ జంట.

ఈ సంఘటనపై డెర్బీషైర్ పోలీసు అధికారి ఒకరు స్పందించారు. లేట్ నైట్ కావడంతో డెర్బీకి సమీపంలో మోర్లీ వద్ద ఓ కారు ఆగిఉందని, అనుమానం వచ్చి వాహనంలోకి చూడగా ఓ జంట లైంగిక వాంఛ తీర్చుకుంటూ ఉండగా చూశామని చెప్పారు. వెంటనే రొమాన్స్ నిలిపివేసి ఫైన్ వేసినట్లు తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ పెనాల్టీ నోటీసులు అందిస్తామని ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు.
ఈ సంఘటనకు సంబంధించి ఈరేవాష్ రెస్పాన్స్ యూనిట్ తమ ట్విట్టర్లో పంచుకున్నారు. #Morley- వద్ద ఓ అపరిచిత జంట లేట్ నైట్ కారులో శృంగారంలో పాల్గొంటూంగా కోవిడ్ ఫైన్ ఎదుర్కోవాల్సి వచ్చింది అని సంఘటనలకు సంబంధించిన చిత్రంతో పాటు ఓ శీర్షిక కూడా పోస్ట్ చేశాడు. ఈ పోస్టుపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఓ ఎంత ఇబ్బందికరంగా సంఘటనో అని ఓ వ్యక్తి స్పందించగా.. మరో యూజర్ పోలీసు కారు నెంబరు ప్లేటును వ్యగ్యంగా ఎత్తి చూపాడు.


ఇక్కడ సూర్యాస్తమయం తర్వాత సన్నిహితంగా ఉన్నందుకు చాలా మందికి పోలీసులు జరిమానా విధించారు. గత నెలలో జరిగిన మరో సంఘటనలో ఇదే కారణంగా డెర్బీషైర్ పోలీసులు ఓ జంటకు జరిమానా విధించారు. అంతేకాకుండా మోల్బోర్న్ సమీపంలో ఉన్న తన ప్రియురాలిని కలవడానికి ఓ వ్యక్తి స్టౌంటన్ హెరాల్డ్ వరకు 100 మైళ్లు కారు నడుపుకుంటూ వచ్చాడు. అయితే సన్నిహితంగా ఉన్న కారణంగా వారికి కూడా జరిమానా విధించారు. వెల్లింగ్టన్‌లోని మెర్సియా మెరీనా వద్ద వారి ఫియాట్ కారులో శృంగారంలో పాల్గొన్నారని మరో జంటకు ఫైన్ వేశారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Coronavirus, Covid-19, Lockdown, United Kingdom

తదుపరి వార్తలు