హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: పెళ్లికి బంధువుల కోసం విమానం బుక్ చేసిన జంట .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

Viral video: పెళ్లికి బంధువుల కోసం విమానం బుక్ చేసిన జంట .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

viral video

viral video

Viral video: ఓ జంట బంధువులను వివాహా మహోత్సవానికి తీసుకెళ్లడానికి విమానాన్ని బుక్ చేసి అందులో తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ వీడియోనే నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ జంట ఇచ్చిన ఆతిధియ్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. వీడియోకి లైక్‌లు కొడుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

పెళ్లిళ్లు స్వర్గాన నిర్ణయించబడతాయని అంటారు. కాని పెళ్లిళ్లు మాత్రం భూమి మీదే జరుగుతాయి. అయితే నూరేళ్ల పంటగా భావించే వివాహ వేడుకకు బంధు, మిత్రుల ఆశీస్సులు కావాలని కోరుకున్న ఓ జంట ఆత్మీయుల ఆశీస్సులతో పాటు వారి మనసులను దోచుకున్నారు. అంగరంగ వైభవంగా నిర్వహించే పెళ్లిళ్లు చూశాం కాని. మొట్టమొటి సారిగా ఓ జంట బంధువులను వివాహా మహోత్సవానికి తీసుకెళ్లడానికి విమానాన్ని(Flight)బుక్ చేసి అందులో తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ వీడియోనే నెట్టింట్లో తెగ చక్కర్లు(Viral) కొడుతోంది. ఆ జంట ఇచ్చిన ఆతిధియ్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. వీడియో(Video)నకి లైక్‌లు కొడుతున్నారు.

Variety Wedding: ఒకే ముహుర్తానికి అక్కాచెల్లెల్నిపెళ్లి చేసుకున్న వరుడు .. వీడియో ఇదిగో..

విమానంలో వివాహానికి..

రాజస్థాన్‌ జైసల్మేర్‌కి చెందిన ఓ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే బంధు మిత్రులు ఆనందంగా తమ పెళ్లికి రావాలని పెళ్లి వేడుక చిరస్థాయిగా గుర్తుండి పోవాలని భావించారు. అందుకోసం ఏకంగా ఓ ప్రైవేట్‌ విమానాన్ని బుక్ చేసుకొని అందులోనే తమ బంధువులందరిని వివాహం జరుగుతున్న చోటికి తీసుకెళ్లారు. చాలా పెళ్లిళ్లలో రుచి కరమైన భోజనాలు, పెళ్లికి వచ్చిన వారికి ఇచ్చే కానుకలు, లేదంటే వెడ్డింగ్ కార్డులు ఖరీదైనవి అచ్చు వేయించడం చూసాం. కాని ఈవిధంగా బంధు, మిత్రులకు సంతోషాన్ని కలిగించేలా ఈవిధంగా విమానంలో తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.

అతిధుల మనసు గెలుచుకున్న జంట..

ఫ్రెండ్స్, బంధువులు, కుటుంబ సభ్యులు ఇలా అందర్ని ఒకే విమానంలో పెళ్లికి తీసుకెళ్తున్న జంట విమానంలో చివరి సీట్లలో కూర్చున్నారు. చూడ ముచ్చటైన జంట వివాహం జరుగుతున్న వీడియో కంటే ..బంధువుల్ని తీసుకెళ్లడానికే ఇంత భారీగా ఖర్చు చేయడం గొప్పగా ఉంది. ఈ ఫ్లైట్ వీడియో నెట్టింట్లో పోస్ట్ చేశారు ఇన్‌స్టాగ్రామ్ యూజర్ శ్రేయాషా. ఆ వీడియో ఇప్పుడు లక్షల వ్యూస్ దాటిపోయింది. లైక్‌లు అయితే లెక్కలేనన్ని వస్తున్నాయి.

OMG: మూఢనమ్మకాలు, మంత్రవిద్యను నమ్మే వాళ్లు ప్రపంచంలో ఎంత మంది ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు..

కోటి దాటిన వ్యూస్ ...

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈ వివాహం జరుగుతుంది. ఈ వీడియోను ఇప్పటికే కోటిమందికిపైగా వీక్షించారు. నెట్టింట్లో ట్రెండ్ సెట్ చేస్తున్న ఈవీడియో అందరి మనసుల్ని గెలుచుకుంటోంది.

First published:

Tags: National News, Rajasthan, Viral Video, Wedding

ఉత్తమ కథలు