Viral video: ముక్కుపచ్చలారని చిన్నారి పట్ల దారుణంగా ప్రవర్తించారు. కన్న వాళ్లే వోడ్కా తాగిస్తు అత్యంత పైశాచీకంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
కొంత మంది నీచులు పసిపిల్లల పట్ల అత్యంత నీచంగా ప్రవర్తిస్తుంటారు. పిల్లలు లేనివారుకొందరు ఆస్పత్రుల చుట్టు, గుళ్ల చుట్టు తిరుగుతుంటే మరికొందరు మాత్రం.. అడ్డమైన పనులు చేస్తుంటారు. ఇప్పటికే పనిపిల్లలను దాడిచేయడం, క్రూరంగా ప్రవర్తించడం, కొట్టడం వంటి ఘటనలు వార్తలలో నిలిచాయి. ఇంకొన్నిచోట్ల పిల్లలను హత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా (Viral) మారింది.
పూర్తి వివరాలు.. ఇంగ్లండ్‌లోని (England) కెంట్లోని డోవర్లో జరిగిన సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. తల్లిదండ్రుల తమ బిడ్డకు వోడ్కా తాగిస్తున్న ఘటన నెట్టింట వైరల్ గా మారింది. కన్న వాళ్లే బిడ్డ పక్కన కూర్చుని మరీ వోడ్కా తాగిస్తున్నారు. ఈ దారుణ ఘటనను రికార్డు చేసి, సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేశారు.
దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో సీరియస్ అయిన.. పోలీసులు చిన్నారి తల్లిదండ్రులపై కేసు నమోదుచేశారు. వోడ్కా ను ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ షూట్ చేసినట్లు నిందితులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్ లు వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా బస్సు కిటీకీ నుంచి పెద్ద పులి దాడిచేసింది.
పూర్తి వివరాలు.. అడవిలో గుండా బస్సు వెళ్తుంది. అప్పుడు డ్రైవర్ చేసిన పని ప్రస్తుతం వైరల్ గా మారింది. బస్సు డ్రైవర్ మెల్లగా కిటీకి తీశాడు. అప్పుడు కిటికీలో నుంచి ఒక పుల్లకు చికెన్ ముక్క పెట్టి పట్టుకున్నాడు. అక్కడ ఒక పులి తిరుగుతుంది. అది చికెన్ ముక్క ఉన్న పుల్లను చూసింది.
వెంటనే పరిగెత్తుకుంటు వచ్చి.. అమాంతం కిటికివైపు దూకింది. పుల్లను నోటితో పట్టుకుంది. చికెన్ ముక్కలను మంచిగా నమిలేసి మింగింది. అతను భయంతో.. దాన్ని కిటికి మూయడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) లో వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇవే వద్దనేది .., పొరపాటున.. కిటీకిలో నుంచి పులి దూరితే పరిస్థితి ఏంటని కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.