హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వర్తమాన రాజకీయాలపై అద్భుతమైన వివరణ.. హర్షగోయెంకా ట్విట్ వైరల్..

వర్తమాన రాజకీయాలపై అద్భుతమైన వివరణ.. హర్షగోయెంకా ట్విట్ వైరల్..

హర్ష గోయేంకా

హర్ష గోయేంకా

Viral news: ప్రముఖ వ్యాపార వేత్త హర్షగోయేంకా వర్తమాన రాజకీయాలపై ట్విట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.

మహారాష్ట్రలో (maharashtra) నెలకొన్న రాజకీయ పరిస్థితులు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీశాయి. ఎక్కడ చూసిన.. మహా రాజకీయాల గురించి చర్చిస్తున్నారు. దీనిపై ఆయన చేసిన ట్విట్ (Tweet) ప్రస్తుంతం నెటిజన్లను ఆలోచించేలా చేస్తుంది. అదేంటంటే.. ఇటీవల శివసేన నుంచి మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగు బాటు ఎగుర వేయడం మాత్రమే కాకుండా తన తో పాటు అనేక మంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకున్నారు. ఈ క్రమంలో తన చాణక్యంతో.. ఇటూ బీజేపీతోను టచ్ లో ఉంటు మహారాష్ట్రలో తనకున్న పట్టు తెలిసేలా చేశారు. అయితే, ఇవి నిజజీవితంలో కూడా మనకు ఎంతగానో ఉపయోగ పడతాయని ఆయన అన్నారు. ఆయన దీనిలో కొన్ని అంశాలను హైలేట్ చేశారు. దీనికి బిజినెస్ రంగానికి జోడించి ఉదాహరణలుచెప్పారు.

ముఖ్యమంత్రి .. ఎల్పప్పుడు అందరికి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా, బిజినెస్ లో తప్పుడు వ్యక్తులతో పార్ట్ నర్ షిప్ ఎప్పటికైన మోసానికే గురయ్యేలా చేస్తుంది. అదే విధంగా, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయకూడదు. కొన్ని రూల్స్ ను అందరు పాటించాలి. అయితే, దేవెంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం కుర్చీని కూడా అంగీకరించారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. తను చేసిన హోదా కన్నా.. తక్కువ పదవిలో కూర్చొడానికి సిద్దపడ్డాడు. అంతే నిరుద్యోగి తన క్వాలిఫికేషన్ కంటే.. తక్కువ హోదా ఉన్న ఉద్యోగం చేయడానికి సైతం సిద్దంగా ఉంటాడు. అనుభవం అనేది అత్యంత ప్రధానమైనది.

ఉద్దవ్ ఠాక్రేకు సరైన అనుభవం లేకపోవడం వలన ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొవడంలో విఫలమయ్యారు. అదే విధంగా మిడిల్ లేవల్ మెనెజర్ లను మర్చిపోకూడదు. వారు భవిష్యత్తులో ఇతర కంపెనీలకు సీఈవో అయ్యే అవకాశం ఉందన్నారు. పొత్తులతో ఏర్పడిన ప్రభుత్వాలు తక్కువ కాలం నిలబడతాయని ఇతర పార్టీలు ముందే గుర్తించాయి. అందుకే అవి అప్రమత్తంగా ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు కొన్ని సార్లు.. బిజినెస్ రంగంలో కూడా ఎదురుకావోచ్చని హర్ష గోయేంకా అన్నారు.

First published:

Tags: Tweets, VIRAL NEWS

ఉత్తమ కథలు