కరోనా ఉందేమో అని కరెన్సీ నోట్లను వాషింగ్ మెషిన్‌లో వేశాడు... ఆ తర్వాత

Coronavirus updates : కరోనా భయంతో... కొంత మంది అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది అలాంటిదే. ఏం జరిగిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: August 2, 2020, 9:26 AM IST
కరోనా ఉందేమో అని కరెన్సీ నోట్లను వాషింగ్ మెషిన్‌లో వేశాడు... ఆ తర్వాత
కరోనా ఉందేమో అని కరెన్సీ నోట్లను వాషింగ్ మెషిన్‌లో వేశాడు... ఆ తర్వాత (Photo credit - AP )
  • Share this:
Coronavirus updates : బట్టలపై కరోనా వైరస్ ఉంటే... వాషింగ్ మెషిన్‌లో వేసి ఉతికేస్తే సరి... మరి కరెన్సీ నోట్లపై ఉంటే ఏం చెయ్యాలి అని ఆలోచించాడు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కి చెందిన ఓ వ్యక్తి. నిజానికి... నోట్లపై కరోనాను పోగొట్టేందుకు... ప్రత్యేక స్ప్రేలు ఉన్నాయి. వాటి లోంచీ వచ్చే పొగలాంటి స్ప్రే... నోట్లు దెబ్బతినకుండా... కరోనాను చంపుతుంది. ఈ విషయం తెలియని అతను... నోట్లపై ఉండే కరోనాను పోగొట్టేందుకు కూడా వాషింగ్ మెషినే సరైనది అనుకున్నాడు. మొత్తం 50000 వోన్లను (మన కరెన్సీలో రూ.3137) వాషింగ్ మెషిన్‌లో వేశాడు. సర్ఫ్ వేసి... స్విచ్ ఆన్ చేశాడు.

కుటుంబంలో ఎవరో చనిపోవడంతో.. అంత్యక్రియలు జరిపినప్పుడు బంధువులు, ఫ్రెండ్స్ ఇచ్చిన డబ్బు అది. ఈ రోజుల్లో ఎవరు మనీ ఇచ్చినా... ఆ నోట్లపై కరోనా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి... వాళ్లు ఇచ్చిన నోట్లపై కరోనా ఉంటే ఏంటి పరిస్థితి అనుకున్నాడు. ఒక్కసారి స్పిన్ అయిన తర్వాత... నోట్లను బయటకు తీశాడు. వాటిలో చాలా వరకూ డ్యామేజ్ అయ్యాయి, చిరిగిపోయాయి. చెలామణీకి పనికిరాకుండా పోయాయి. షాకయ్యాడు. లబోదిబోమన్నాడు.

నోట్లను ఎండబెట్టి దగ్గర్లోని బ్యాంక్ ఆఫ్ కొరియాకి వెళ్లాడు. బ్యాంక్ అధికారులు... చిరిగిన నోట్లు తీసుకొని కొత్త నోట్లు ఇవ్వడం కుదరదని చెప్పారు. కొద్దిగా చిరిగి ఉంటే తీసుకుంటాం తప్ప... ఇంత ఎక్కువగా చిరిగితే తీసుకోలేం అని అధికారులు తెలిపారు.

అధికారులను పదే పదే బతిమలాడాడు. చివరకు... సగం విలువ కట్టి... నోట్లను ఎక్స్‌ఛేంజ్ చేశారు. కరోనా టెన్షన్‌తో ఇలా నోట్లను వాషింగ్ మెషిన్లలో, మైక్రోవేవ్‌లలో పెట్టొద్దని ఈ సందర్భంగా అధికారులు కోరారు. ఐతే... కరోనా సోకకుండా కరెన్సీ నోట్లను ఎలా శుభ్రం చేసుకోవాలనే అంశంపై దక్షిణ కొరియాలో ఇప్పటికీ గైడ్‌లైన్స్ లేవు.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 9:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading